అరుదైన వ్యాధుల ఔషధాలకు 900 కోట్లతో కేంద్రం ప్రాజెక్టు.. కోట్లాది మందికి ఉపయుక్తం

అరుదైన వ్యాధులతో బాధపడే వారికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అరుదైన వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మందులను అందించేందుకు కీలక ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం రూ.900 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ తరహా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తోంది. వ్యాధి తీవ్రతను బట్టి రూ.50 లక్షల వరకు నేరుగా రోగుల ఖాతాలకు నగదును కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తోంది.

Drugs for rare diseases

అరుదైన వ్యాధుల ఔషధాలు

అరుదైన వ్యాధులతో బాధపడే వారికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అరుదైన వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మందులను అందించేందుకు కీలక ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం రూ.900 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ తరహా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తోంది. వ్యాధి తీవ్రతను బట్టి రూ.50 లక్షల వరకు నేరుగా రోగుల ఖాతాలకు నగదును కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తోంది. దీనివల్ల వేలాదిమంది లబ్ధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఖరీదైన ఔషధాల ధరలను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులను కేటాయించింది. గౌచర్ డిసీజ్ ( జన్యుపరమైన లోపాలతో కాలేయం, లేహం వంటి ప్రాంతాల్లో కొవ్వు పేరుకుపోయి అవయవాల పని తీరుపై ప్రతికూల ప్రభావం చూపించే వ్యాధి) డుచెన్ కండరాల బలహీనత, సిస్టెక్ ఫైబ్రోసిస్ (ఒక జన్యువుమ్యూటేషన్ కారణంగా ఊపిరితిత్తులు, క్లోమం ఇతర అవయవాలు దెబ్బతినడం) వెన్నెముక కండరాల క్షీణత వంటి 13 రకాల రుగ్మతలను అరుదైన వ్యాధులుగా పరిగణిస్తారు. భారత్లో అరుదైన వ్యాధులతో సతమతవుతున్న వారి సంఖ్య 19 కోట్ల వరకు ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. వీరందరికీ మేలు చేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆయా వ్యాధులతో బాధపడే వారికి ఉచిత మందులను అందించనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విధి విధానాలను తయారు చేసే పనులు కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన బృందం ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. 

దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక మంది రోగులు ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవలను పొందలేని పరిస్థితి నెలకొంది. ఆయా వైద్య సేవలకు అవసరమైన మందులు కొనుగోలు చేయాలంటే వేలాది రూపాయలను వెచ్చించాల్సిన దుస్థితి రోగులకు ఏర్పడుతుంది. ఆర్థిక స్తోమత సరిగా లేని కారణంగా ఎంతోమంది వైద్య సేవలు పొందలేకపోతున్నారు. అవసరమైన మందులు కొనుగోలు చేయలేక అర్ధాంతరంగా మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఈ క్రమంలోనే అటువంటి నిరుపేద రోగులకు అండగా ఉండే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కేలక ప్రాజెక్టును చేపడుతుందని వైద్య రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది రోగులకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్