ఆర్జి కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఇంటిపై సిబిఐ దాడులు.. 15చోట్ల ఏకకాలంలో తనిఖీలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తాలోని ఆర్జి కార్ మెడికల్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని అత్యాచారణ ఘటన విచారణలో సిబిఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న పలువురిని పలుమార్లు విచారించిన సిబిఐ అధికారులు.. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ ఘోష్ ను పలుమార్లు విచారించింది. ఒకవైపు విచారణ చేస్తూనే తాజాగా ఆదివారం ప్రిన్సిపల్ కు సంబంధించి ఆస్తులపైన సిబిఐ దాడులు మొదలుపెట్టింది. మొత్తంగా 15 చోట్ల సిబిఐ బృందాలు ఏకకాలంలో తనిఖీలు మొదలుపెట్టాయి.

Dr Sanjay Ghosh

డాక్టర్ సంజయ్ ఘోష్ 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తాలోని ఆర్జి కార్ మెడికల్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని అత్యాచారణ ఘటన విచారణలో సిబిఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న పలువురిని పలుమార్లు విచారించిన సిబిఐ అధికారులు.. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ ఘోష్ ను పలుమార్లు విచారించింది. ఒకవైపు విచారణ చేస్తూనే తాజాగా ఆదివారం ప్రిన్సిపల్ కు సంబంధించి ఆస్తులపైన సిబిఐ దాడులు మొదలుపెట్టింది. మొత్తంగా 15 చోట్ల సిబిఐ బృందాలు ఏకకాలంలో తనిఖీలు మొదలుపెట్టాయి. ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సిబిఐ ఘోష్ పై కేసు నమోదు చేసింది. ఆగస్టు 9వ తేదీన ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ అత్యాచారాన్ని గురికావడం దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉందని విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సిబిఐకి బదిలీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తోంది. కేసును సిబిఐ సేకరించిన తర్వాత విచారణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆస్తులపై సిబిఐ అధికారులు దాడులు నిర్వహించడం సర్వత్ర ఆసక్తిని కలిగిస్తోంది. గత కొన్నాళ్లుగా ఘోష్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కోట్లాది రూపాయలను నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆసుపత్రికి సంబంధించిన నిధులు దుర్వినియోగం, మందులకు సంబంధించిన వ్యవహారంలో ట్రైనీ డాక్టర్ కీలక అంశాలను గుర్తించారని, అందుకే ప్రిన్సిపల్ ఆమెపై కక్షగట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఆ కోణంలోనూ సిబిఐ అధికారులు ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు. మాజీ ప్రిన్సిపల్ ఘోష్ పరిధికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగాలు నేపథ్యంలో సిబిఐ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసును కూడా న్యాయస్థానం సిబిఐకి బదిలీ చేసింది. మూడు వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఎలా ఉంటే ట్రైన్ ఈ డాక్టర్ హత్య కేసు కు సంబంధించి సిబిఐ అధికారులు సందీప్ ఘోష్ సహా మరో నలుగురికి శనివారం లైవ్ డిటెక్టర్ పరీక్షలు చేశారు. దీనికోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ కోర్టులో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదంటూ కన్నీటి పర్యంతం కావడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొద్దిరోజులు కిందటి వరకు ఎటువంటి పశ్చాత్తాపము లేకుండా వ్యవహరించిన సంజయ్.. తాజాగా ఈ కేసుతో తన సంబంధం లేదంటూ కన్నీటి పర్యంతం కావడం గమనార్హం. ఈ కేసులో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెడికల్ కాలేజీలో జరిగిన అవకతవకలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా కమిటీని ఏర్పాటు చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్