పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా నగరంలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురై హత్య గావించబడిన వైద్య విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి సిబిఐ చార్జి షీట్ దాఖలు చేసింది. ఈ చార్జి షీట్ లో సంచలన విషయాలను సిబిఐ ప్రస్తావించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును విచారించాల్సిందిగా పశ్చిమబెంగాల్ హైకోర్టు సిబిఐకు అప్పగించింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఈ ఘటనకు సంబంధించి నిరసనలు వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును స్వీకరించి విచారించింది.
సంజయ్ రాయ్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా నగరంలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురై హత్య గావించబడిన వైద్య విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి సిబిఐ చార్జి షీట్ దాఖలు చేసింది. ఈ చార్జి షీట్ లో సంచలన విషయాలను సిబిఐ ప్రస్తావించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును విచారించాల్సిందిగా పశ్చిమబెంగాల్ హైకోర్టు సిబిఐకు అప్పగించింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఈ ఘటనకు సంబంధించి నిరసనలు వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును స్వీకరించి విచారించింది. పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను అందించాల్సిందిగా సుప్రీంకోర్టు గతంలోనే కోరింది. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు సుమారు రెండు నెలలపాటు విచారణ సాగించారు. విచారణ అనంతరం తాజాగా సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ (33) పై సిబిఐ కోల్ కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల ఈ షార్జ్ షీట్ ను దాఖలు చేసింది. స్థానిక పోలీసులు దగ్గర పౌర వాలంటీర్ గా పని చేస్తున్న సంజయ్ రాయ్ ఆగస్టు 9న ఈ నేరానికి పాల్పడ్డాడని అందులో పేర్కొంది. ఆసుపత్రి సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ తన బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు అందులో పేర్కొంది.
చార్జ్ సీట్ లో గ్యాంగ్ రేప్ గురించి సిబిఐ అధికారులు ప్రస్తావించ లేదు. అదే సమయంలో విచారణ ముగిసినట్లు పేర్కొనలేదు. దాదాపు 200 మంది స్టేట్మెంట్లను సిబిఐ అధికారులు సిబిఐ అధికారులు ఈ చార్జ్ సీట్లో పేర్కొన్నారు. సుమారు 100 మంది సాక్షులను విచారించింది. ఇవన్నీ రాయ్ నే ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నాయని సిబిఐ వర్గాలు సమాచారం. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, ఇది గ్యాంగ్ రేప్ అనుమానితులు ఇంకా ఉన్నారా..? అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. పోస్టుమార్టం రిపోర్టులో వైద్యరాలి మృతదేహంలో ఎక్కువ పరిమాణంలో వీర్యం లభించడంతో గ్యాంగ్ రేప్ అనుమానాలకు దారి తీసింది. కోల్ కతా పోలీసులు ఆగస్టు పదో తేదీన సంజయ్ రాయ్ ను అరెస్టు తరువాత తానే ఈ నేరానికి పాల్పడ్డానని తొలుత అంగీకరించాడు. ఆ తరువాత పాలిగ్రాఫ్ పరీక్ష చేస్తుండగా తాను చేయలేదని అడ్డం తిరిగాడు. అయితే, వైద్యరాలి మృతదేహం దగ్గర లభ్యమైన బ్లూటూత్ పరికరం రాయ్ ను పట్టించింది. సెమినార్ హాల్లో ఉన్న ఆర్జీ కార్ ఆసుపత్రి మూడో ఫ్లోర్ లో రాయ్ సంచరించడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. అతడు తెల్లవారుజామున నాలుగు గంటలకు అక్కడికి వచ్చి 45 నిమిషాల తర్వాత తిరిగి వెళ్ళాడు. బాధితురాలి గోళ్ళలో లభ్యమైన రక్తం, చర్మం సరిపోలినట్లు సిబిఐ అధికారుల చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు కు సంబంధించి సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ ముగియలేదు. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతోందని సిబిఐ అధికారులు చెబుతున్నారు.