ఒక్క పెగ్గు తాగినా ఆరు రకాల క్యాన్సర్లు.. బాంబ్ పేల్చిన శాస్త్రవేత్తలు

అమెరికాకు చెందిన ప్రముఖ సర్జన్ కీలక విషయాలను బహిర్గతం చేశారు. మద్యం తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. మద్యం బాటిల్లపై హెచ్చరికలతో కూడిన లేబుళ్లు వేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అమెరికా సర్జన్ జనరల్ వివేక మూర్తి పిలుపునిచ్చారు.

Iconic image

ప్రతికాత్మక చిత్రం

మద్యం తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. మద్యం ఆరోగ్యానికి హానికరమనే అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లేందుకు వివిధ మాధ్యమాలను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటికి ఎంతోమంది మద్యం తాగుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ సర్జన్ కీలక విషయాలను బహిర్గతం చేశారు. మద్యం తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. మద్యం బాటిల్లపై హెచ్చరికలతో కూడిన లేబుళ్లు వేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అమెరికా సర్జన్ జనరల్ వివేక మూర్తి పిలుపునిచ్చారు. తాజాగా ఆయన చేసిన ఈ సూచనలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మద్యం తాగడం వల్లే కాకుండా నిత్యం వంటకాల్లో వినియోగించే ఆయిల్ వంటి కొన్ని రకాల విత్తన నూనెల కారణంగా పెద్ద పేగు క్యాన్సర్ రోగులు కూడా పెరుగుతున్నట్లు అమెరికాలోని మరో అధ్యయనం సూచించింది. అమెరికాలో ఆల్కహాల్ వల్ల ఏటా దాదాపు లక్షమంది క్యాన్సర్ బారిన పడుతుండగా వీరులో 20,000 మంది ప్రాణాలను కోల్పోతున్నట్లు అధ్యయనం పేర్కొంది.

సర్జన్ జనరల్ వివేక్ మూర్తి పేర్కొన్న మేరకు పొగాకు, ఊబకాయం తర్వాత క్యాన్సర్కు మూడో అతిపెద్ద కారణంగా ఆల్కహాల్ ఉంటున్నట్లు వివరించారు. మద్యం తాగడం వల్ల రొమ్ము, కాలేయం, పెద్దపేగు, అన్న వాహిక, గొంతు సహా ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ ప్రమాదాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి వక్కాణించారు. ముఖ్యంగా మద్యం ఉత్పత్తులపై క్యాన్సర్ ప్రమాదాన్ని సూచించేలా నూతనంగా రూపొందించిన ఆరోగ్య హెచ్చరికలను తప్పనిసరి చేయాలని సర్జన్ జనరల్ అమెరికా కాంగ్రెస్ను కోరింది. పొగాకు వల్ల క్యాన్సర్ వస్తుందని 91 శాతం మంది అమెరికన్లు గుర్తిస్తుండగా, 50% మంది మాత్రమే ఆల్కహాల్ ను క్యాన్సర్ కారకంగా గుర్తిస్తున్నట్లు తెలియజేసింది. కాబట్టి దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సర్జన్ జనరల్ కోరింది. దీన్ని ఆల్కహాల్ బేవరేజెస్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఐర్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే ఆల్కహాల్ ఉత్పత్తులపై క్యాన్సర్ హెచ్చరికలను తప్పనిసరి చేశాయి. 

వంట నూనెలతోనూ క్యాన్సర్ ప్రమాదం 

మరోవైపు వంట నూనెలతోనూ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందన్న అధ్యయనాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇళ్లల్లో, రెస్టారెంట్లలో వాడే సన్ఫ్లవర్ ఆయిల్, ద్రాక్ష గింజల నూనె, కొనోల, మొక్కజొన్న నూనెలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెళ్లడైంది. పెద్ద పేగు క్యాన్సర్ ముఖ్యంగా యువకుల్లో ఈ తరహా క్యాన్సర్ పెరుగుదలకు ఈ వంట నూనెలు కారణం అవుతున్నట్లు వెల్లడించింది. ఈ అధ్యాయంలో భాగంగా 30 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు ఉన్న 80 మంది పెద్ద పేగు క్యాన్సర్ రోగుల కణితులను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. వారి కనుతుల్లో చాలా ఎక్కువ స్థాయిలో బయో యాక్టివ్ లిపిడ్లు ఉన్నాయి. విత్తనాల నుంచి వచ్చే నూనెలో వాడకం వల్ల బయో యాక్టివ్ లిపిడ్లు అధికంగా పెరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ వంట నూనెలు వినియోగించడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్