వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాయి. ముఖ్యంగా విజయవాడ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వరద బీభత్సం నుంచి మెల్లగా బయటపడుతున్నారు. పది రోజుల నుంచి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఒక వైపు ప్రభుత్వం మరోవైపు స్వచ్ఛంద సంస్థలు ఆదుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేసేందుకు సిద్ధమవుతోంది.
వరద నీటిలో విజయవాడ ప్రాంతం
వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాయి. ముఖ్యంగా విజయవాడ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వరద బీభత్సం నుంచి మెల్లగా బయటపడుతున్నారు. పది రోజుల నుంచి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఒక వైపు ప్రభుత్వం మరోవైపు స్వచ్ఛంద సంస్థలు ఆదుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేసేందుకు సిద్ధమవుతోంది. ప్రాథమికంగా వరద నష్టంపై ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘంలో ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, పురపాలక, హోమ్, విపత్తు నిర్వహణ శాఖల మంత్రులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉప సంఘం వీలైనంత త్వరగా తన నివేదిక ఇవ్వాలని సిఎస్ తన ఉత్తర్వులు కోరారు. వరద నష్టం అంచనా వేసేందుకు, విధివిధానాలు రూపొందించేందుకు మొత్తం పర్యవేక్షణ కోసం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
45 మంది మృత్యువాత
ఏపీలో వరదల వలన పలు జిల్లాల్లో 45 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లాలో 45 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పలనాడులో ఒకరు, ఏలూరు జిల్లాలో ఒకడు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించంది. లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 19,686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. 3,913 కిలో మీటర్లు మేర ఆర్ అండ్ బి రహదారులు దెబ్బతిన్నాయి. 558 కిలోమీటర్లు అర్బన్ రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడినట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ప్రాథమిక అంచనాకు వచ్చిన వాటితోపాటు మిగిలిన అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ ఉప సంఘం పూర్తిస్థాయి నష్ట నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదికను అందించి నష్టపరిహారాన్ని కోరనుంది.