(Pic : అంబానీ ఇంట పెళ్లి సందడి)
ఈవార్తలు, నేషనల్ న్యూస్ : Anant Ambani Radhika Merchant | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మర్చంట్ ఫ్యామిలీకి చెందిన ఆడబిడ్డ రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ గురువారం ఘనంగా జరిగింది. రాధిక మర్చంట్.. ప్రముఖ పారిశ్రామిక వేత్త వీరేన్ మర్చంట్, శైల కూతురు. రాజస్థాన్‌లోని శ్రీనాథ్ జీ ఆలయంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకలో అంబానీ ఫ్యామిలీ, మర్చంట్ ఫ్యామిలీ, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. అనంత్, రాధికకు ఇంతకుముందే పరిచయం ఉంది.
అనంత్ అంబానీ ప్రొఫైల్ :
ముకేశ్ అంబానీ, నీతా అంబానీల రెండో కొడుకు. 1995లో పుట్టాడు. అమెరికాలోని బ్రౌన్ వర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అనంత్.. ముంబై ఇండియన్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. జియో ప్లాట్‌ఫాం డైరెక్టర్‌గానూ కొనసాగుతున్నాడు.
రాధిక మర్చంట్ ప్రొఫైల్ :
న్యూయార్క్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసింది. ఎన్‌కోర్ హెల్త్ కేర్ బోర్డులో డైరెక్టర్‌గా ఉంది.
( Pic : Anant Ambani, Radhika Merchant )
Anant Ambani to marry Radhika Merchant, their 'Roka' ceremony was held today at Shrinathji Temple in Nathdwara, Rajasthan. pic.twitter.com/iyUvS6xixs
— ANI (@ANI) December 29, 2022