బంకర్లు.. వీటిని ఎక్కువగా రక్షణ శాఖ సిబ్బంది, మావోయిస్టులు, తీవ్రవాదులు వంటివాళ్లు వినియోగిస్తుంటారు. తమ రక్షణ కోసం వీటిని అనేకచోట్ల ఏర్పాటు చేసుకుంటూ శత్రుదాడులు నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఆర్థికంగా బలంగా ఉన్న వారి రక్షణ కోసం అమెరికాలోని ఒక కంపెనీ ప్రత్యేకంగా బంకర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును చేపడుతోంది. భవిష్యత్తులో యుద్ధాలు జరిగే అవకాశం ఉందని, ప్రకృతి విపత్తులు వల్ల తీవ్రమైన నష్టాలు జరిగేందుకు ఆస్కారం ఉందన్న అభిప్రాయంతో సదర సంస్థ బంకర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. తరహా నష్టాలనుంచి బయటపడేందుకు బంకర్లు కీలకంగా ఉపయోగపడతాయని ఆ సంస్థ భావిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
బంకర్లు.. వీటిని ఎక్కువగా రక్షణ శాఖ సిబ్బంది, మావోయిస్టులు, తీవ్రవాదులు వంటివాళ్లు వినియోగిస్తుంటారు. తమ రక్షణ కోసం వీటిని అనేకచోట్ల ఏర్పాటు చేసుకుంటూ శత్రుదాడులు నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఆర్థికంగా బలంగా ఉన్న వారి రక్షణ కోసం అమెరికాలోని ఒక కంపెనీ ప్రత్యేకంగా బంకర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును చేపడుతోంది. భవిష్యత్తులో యుద్ధాలు జరిగే అవకాశం ఉందని, ప్రకృతి విపత్తులు వల్ల తీవ్రమైన నష్టాలు జరిగేందుకు ఆస్కారం ఉందన్న అభిప్రాయంతో సదర సంస్థ బంకర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. తరహా నష్టాలనుంచి బయటపడేందుకు బంకర్లు కీలకంగా ఉపయోగపడతాయని ఆ సంస్థ భావిస్తుంది. దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎవరు ప్రాణాలకు ఇబ్బందు లేకుండా ఈ బంకర్లు ఉపయోగపడతాయి. సరిగ్గా ఇదే పాయింట్ను పట్టుకొని అమెరికాకు చెందిన ఒక కంపెనీ వ్యాపారం ప్రారంభించింది.
యుద్ధాలు జరిగిన, భయంకరమైన విపత్తుల సంభవించిన ప్రాణాలకు ప్రమాదం లేని అత్యంత దుర్యోధ్యమైన బంకర్లు నిర్మిస్తామని, వాటిలో సురక్షితంగా ఉండవచ్చని ప్రకటించింది. ఇవి సాధారణ ప్రజల కోసం కాదని.. సంపన్నులు, సెలబ్రిటీల కోసం తయారు చేస్తున్నట్లు సదరు సంస్థ పేర్కొంది. ఒక్కో బంకర్ ఖరీదు రెండు కోట్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.172 కోట్లు. ఈ బంకర్లలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు ఉన్నంతటి రక్షణ ఉంటుందని సదరు కంపెనీ సేఫ్ వెల్లడించింది. అమెరికాలోని 50 నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 1000 ప్రాంతాల్లో ఈ అధ్యాధునిక లగ్జరీ బంకర్లను నిర్మించబోతున్నామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు ఏది అనే పేరు పెట్టింది. మొట్టమొదటి అమెరికాలోని వర్జీనియాలో 625 మందికి సరిపోయే బంకర్లను వచ్చే ఏడాది నిర్మిస్తామని ఆల్ కోర్బి తెలిపారు. వీటిలో ఉండే వారికి దేశాధినేతలకు ఉండే భద్రత కంటే ఎక్కువ భద్రత ఉంటుంది. అత్యంత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నామన్న భావన వారికి కలుగుతుంది. విపత్కర సమయాల్లో వారు తమ ఎల్లను వదిలిపెట్టి ఇక్కడ ఎటువంటి ఆందోళన లేకుండా గడపవచ్చు అని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
సేఫ్ నిర్మించబోయే బంకర్లు భూమికి 200 అడుగుల దిగువన ఉంటాయి. పేలుడు పదార్థాలు, బాంబులు కూడా ఏమీ చేయలేని దృఢత్వంతో వీటి గోడలను నిర్మిస్తారు. బంకర్లలో సురక్షితమైన హై స్పీడ్ లిఫ్టును ఉపయోగిస్తారు. ఇక సదుపాయాల విషయానికి వస్తే కృత్రిమ మేదతో కూడిన ఆరోగ్య సదుపాయాలు, స్విమ్మింగ్ పూల్స్, డైనింగ్ సౌకర్యాలు, బయోమెట్రిక్ వ్యవస్థలు, ఇంటర్ ఆక్టివ్ టెక్నాలజీతో కూడిన గోడలు, పై కప్పులు, లైటింగ్ వంటివి ఉంటాయి. ఖరీదును బట్టి సదుపాయాల కూడా మారతాయి. 2000 అడుగులు విస్తీర్ణం నుంచి 20వేల అడుగుల విస్తీర్ణం వరకు రకరకాల సైజుల్లో బంకర్లు ఉంటాయి. ఏరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఫోర్స్ వెబ్సైటు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అనేక విపత్తులు, యుద్దాల వల్ల అమెరికాలోని అనేక ప్రాంతాల ప్రజలు భయాందోళనతో బతుకుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతంగా ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారికి భరోసాను కల్పించేలా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని పలువురు పేర్కొంటున్నారు.