బిఎస్ఎన్ఎల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. మెరుగైన రీఛార్జ్ ప్లాన్.!

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఆ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తక్కువ మొత్తం రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రోజులు పాటు ఇంటర్నెట్ వినియోగం పొందే అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ కల్పించింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ సంస్థలకు పోటీగా బిఎస్ఎన్ఎల్ వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే ఇతర నెట్వర్క్ నుంచి భారీ సంఖ్యలో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. తమవైపు వస్తున్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు విభిన్నమైన ఆఫర్లను ఆ సంస్థ ప్రకటిస్తోంది. తాజాగా ప్రకటించిన ప్లాన్లో వినియోగదారులకు దీర్ఘకాలిక చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్ డేటాను అందిస్తున్నారు. వినియోగదారుల కోసం 425 రోజులు చెల్లుబాటు పొందే అవకాశాన్ని ఇచ్చింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఆ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తక్కువ మొత్తం రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రోజులు పాటు ఇంటర్నెట్ వినియోగం పొందే అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ కల్పించింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ సంస్థలకు పోటీగా బిఎస్ఎన్ఎల్ వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే ఇతర నెట్వర్క్ నుంచి భారీ సంఖ్యలో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. తమవైపు వస్తున్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు విభిన్నమైన ఆఫర్లను ఆ సంస్థ ప్రకటిస్తోంది. తాజాగా ప్రకటించిన ప్లాన్లో వినియోగదారులకు దీర్ఘకాలిక చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్ డేటాను అందిస్తున్నారు. వినియోగదారుల కోసం 425 రోజులు చెల్లుబాటు పొందే అవకాశాన్ని ఇచ్చింది. బిఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2,399 రూపాయలుగా నిర్ణయించారు. దీని ద్వారా 425 రోజులు పాటు ఇంటర్నెట్ తో పాటు ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. ఇది మొత్తంగా 14 నెలలపాటు అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ నెంబర్కు ఆయన అపరమితమైన వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వినియోగదారులు ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇప్పటికే ఈ రీఛార్జ్ ప్లాన్ పట్ల వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు బిఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్లాన్ వేయించుకున్న వినియోగదారుల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 

బిఎస్ఎన్ఎల్ సంస్థ గడిచిన కొద్దిరోజులుగా విభిన్నమైన ప్లాన్స్ తో మార్కెట్లోకి వస్తోంది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ను కూడా విస్తరిస్తోంది. 5జీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలోనే వివిధ నెట్వర్క్ నుంచి బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అవుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్కు సరిగా ఉండడంతో పాటు ఇంటర్నెట్ కూడా వేగంగా ఉండడంతో ఇతర ప్రైవేట్ నెట్వర్కులకు చెందినవారు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బిఎస్ఎన్ఎల్ వైపు వస్తున్న కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడం ద్వారా మరింత మందిని తమ వైపు ఆకర్షించవచ్చన్న ఉద్దేశంతో విభజనమైన ఆఫర్లను ఆ సంస్థ ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే 425 రోజులకు సంబంధించిన ప్రత్యేక ప్లాన్ ను తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ఈ ప్లాన్ ప్రస్తుతం ఎక్కువమంది రీచార్జ్ చేయించుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్