బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఎలక్ర్టికల్‌ స్కూటర్‌ భయ్యా.. 150 కిలో మీటర్లు రేంజ్‌.!

గడిచిన కొన్నాళ్లుగా ఎలక్ర్టికల్‌ స్కూటర్లు వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతినెల పెట్రోల్‌ ఖర్చును ఎలక్ర్టికల్‌ వాహనాలు వినియోగం వల్ల తగ్గించుకోవచ్చు. అదే సమయంలో స్మూత్‌ రైడ్‌కు అవకాశం ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఎలక్ర్టికల్‌ స్కూటర్లు వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే, సాధారణ వాహనాలతో పోలిస్తే ఎలక్ర్టికల్‌ వాహనాలు ఖరీదు కొంత ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలా మందికి ఆసక్తి ఉన్న అటువైపు చూడలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఎలక్ర్టికల్‌ స్కూటర్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. ప్రముఖ కంపెనీ టీవీఎస్‌ స్కూటర్‌ విభాగంలో టీవీఎస్‌ i Qube స్కూటర్‌ను తెచ్చింది.

Tvs i Qube scooters

టీవీఎస్‌ i Qube స్కూటర్‌

గడిచిన కొన్నాళ్లుగా ఎలక్ర్టికల్‌ స్కూటర్లు వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతినెల పెట్రోల్‌ ఖర్చును ఎలక్ర్టికల్‌ వాహనాలు వినియోగం వల్ల తగ్గించుకోవచ్చు. అదే సమయంలో స్మూత్‌ రైడ్‌కు అవకాశం ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఎలక్ర్టికల్‌ స్కూటర్లు వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే, సాధారణ వాహనాలతో పోలిస్తే ఎలక్ర్టికల్‌ వాహనాలు ఖరీదు కొంత ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలా మందికి ఆసక్తి ఉన్న అటువైపు చూడలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఎలక్ర్టికల్‌ స్కూటర్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. ప్రముఖ కంపెనీ టీవీఎస్‌ స్కూటర్‌ విభాగంలో టీవీఎస్‌ i Qube స్కూటర్‌ను తెచ్చింది. సేల్స్‌ పరంగా, మైలేజ్‌ పరంగా ఇది దూసుకు వెళుతోంది. TVS iQube భారత మార్కెట్‌లో ప్రస్తుతం ఐదు వేరియంట్‌ల్లో అందుబాటులో ఉంది. i Qube 2.2 kWh, i Qube 3.4 kWh, iQube S 3.4 kWh, iQube ST3.4 kWh, iQube ST 5.1 kWh లాంటి వేరియంట్స్‌లో లభిస్తోంది. వీటి ఎక్స్‌ షోరూమ్‌ ధరలు విషయానికి వస్తే రూ.95 వేలు నుంచి ప్రారంభమవుతూ రూ.1,58,834 వరకు ఉన్నాయి. ఆయా వేరియంట్స్‌ ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు తమ అవసరాలను, బడ్జెట్‌కు తగ్గట్టుగా ఎంచుకోవచ్చు. ఇందులోని టీవీఎస్‌ ఐక్యూబ్‌ 2.2 kWh వేరియంట్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 75 కిలో మీటర్లు వరకు ప్రయాణించవచ్చు.

దీని గరిష్ట వేగం 75 కిలో మీటర్లు. కేవలం రెండు గంటల్లో ఈ వేరియంట్‌ పూర్తిగా చార్జ్‌ అవుతుంది. 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌ వేరియంట్‌ మొత్తం 100 కిలో మీటర్లు ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇక అతిపెద్ద 5.1 kWh బ్యాటరీ వేరియంట్‌ ఒకసారి చార్జ్‌తో 150 కిలో మీటర్లు వరకు ప్రయాణించగలదు. ఇక ఈ స్కూటర్‌లోని ఫీచర్లు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఐదు అంగాళాల నుంచి ఏడు అంగుళాల వరకు ఉన్న TFT టచ్‌ స్ర్కీన్‌ డిస్‌ ప్లే, వాయిస్‌ అసిస్టెంట్‌, నావిగేషన్‌, కాల్‌ అండ్‌ ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌, చార్జింగ్‌ పోర్ట్‌ వంటి స్మార్ట్‌ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. అలాగే, ఇందులో 32 లీటర్లు అండ్‌ సీట్‌ స్టోరేజ్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌, రివర్స్‌ అసిస్టెంట్‌ వంటి ప్రయోగాత్మక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇవి వినియోగదారులకు స్మార్ట్‌, సౌకర్యవంతమైన రైడింగ్‌ అనుభూతిని అందిస్తాయి. అన్ని వేరియంట్లలో డిస్క్‌ బ్రేక్‌లు, రీ జనరేటివ్‌ బ్రేకింగ్‌ ఉన్నాయి. దీని ద్వారా ప్రయాణం అత్యధికంగా సురక్షితంగా ఉంటుంది. 4.4 kWh మోటార్, బలమైన చాసిస్‌ దీన్ని ఈ సెగ్మెంట్‌లో వేగంగా, మృదువుగా నడిచే స్కూటర్‌గా నిలిపింది. స్టైల్‌, పనితీరు కలిపి తక్కువ బడ్జెట్‌లో ఉత్తమ ఎంపిక కావాని కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్