ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వైపు వినియోగదారులు చూస్తున్నారు. ఒకప్పుడు లక్షలాదిమంది వినియోగదారులతో అగ్రస్థానంలో నిలిచిన బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీ పడలేక వెనుకబడిపోయింది. అయితే మళ్లీ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికం సంస్థలకు దీటుగా ఆఫర్లను, సేవలను అందిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే వివిధ ప్రైవేటు టెలికాం సంస్థల నుంచి లక్షలాదిమంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ లోకి పోర్టు అయ్యారు.
బిఎస్ఎన్ఎల్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వైపు వినియోగదారులు చూస్తున్నారు. ఒకప్పుడు లక్షలాదిమంది వినియోగదారులతో అగ్రస్థానంలో నిలిచిన బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీ పడలేక వెనుకబడిపోయింది. అయితే మళ్లీ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికం సంస్థలకు దీటుగా ఆఫర్లను, సేవలను అందిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే వివిధ ప్రైవేటు టెలికాం సంస్థల నుంచి లక్షలాదిమంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ లోకి పోర్టు అయ్యారు. బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నేపథ్యంలోనే బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో శుభవార్త అందించింది. వినియోగదారులను ఖరీదైన రీఛార్జ్ ప్లాన్ నుంచి విముక్తి చేసేందుకు అనుగుణంగా చౌకైన ప్లాంట్స్ ను ప్రవేశపెడుతోంది. బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం వినియోగదారులకు అనేక రీఛార్జ్ ప్లాన్లు అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ తాజాగా రూ.2,399 తో రీఛార్జి ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితితో దీనిని అందిస్తోంది. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఒకేసారి 400 రోజులపాటు రీఛార్జ్ ఇబ్బందుల నుంచి ఈ ప్లాన్ చేస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 395 రోజులు చెల్లుబాటును అందిస్తోంది ఈ ప్లాన్. ఈ ప్లాన్ లో రోజుకు 2gb డేటా పొందవచ్చు. ఇందులో కంపెనీ వినియోగదారులకు జింగ్ మ్యాజిక్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, చాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ ఆస్ట్రో టెల్ తోపాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తోంది. అలాగే, రూ.1899 మరో ప్లాను వినియోగదారుల కోసం బిఎస్ఎన్ఎల్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ లో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ లో మొత్తం 600 జిబి డేటాను పొందవచ్చు. ప్లాన్లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి.
అలాగే మరో ప్లాన్ కూడా బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది. అదే రూ.1499 ప్లాన్. ఈ ప్లాన్ లో 336 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్ ఏ నెట్వర్క్ అయినా అపరిమిత ఉచిత కాలింగ్ అందిస్తుంది. కంపెనీ వినియోగదారులు ఈ ప్లాన్ లో మొత్తం 24 జీబీ డేటాను పొందుతారు. ఇది కాకుండా రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. రూ.1198 మరో ప్లాన్ అందుబాటులో ఉంది. బిఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్ కోసం ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 365 రోజుల లాంగ్ వాలిడిటీ లభిస్తుంది. ఈ రీఛార్జి ప్లాన్ అన్ని నెట్వర్కులకు 300 నిమిషాలు వాయిస్ కాలింగ్ అందిస్తుంది. 12 నెలల పాటు వినియోగదారులకు నేలకు 3జిబి డేటా అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్లు వినియోగదాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు బిఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు.