తెలంగాణలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కొద్దిరోజుల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీలకు ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తూ భారతీయ రాష్ట్ర సమితికి ఒకటి, కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలు దక్కుతాయి. సాధారణంగా ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటే 19 మంది ఎమ్మెల్యేలు ఓట్లు అసవరం. అయితే, గడిచిన ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితికి వచ్చిన 39 స్థానాల్లో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, ఆ స్థానానికి బీఆర్‌ఎస్ కోల్పోయింది. మిగిలిన 38 స్థానాలతో బీఆర్‌ఎస్‌కు రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవచ్చు. కానీ, పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు.
కేసీఆర్
తెలంగాణలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కొద్దిరోజుల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీలకు ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తూ భారతీయ రాష్ట్ర సమితికి ఒకటి, కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలు దక్కుతాయి. సాధారణంగా ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటే 19 మంది ఎమ్మెల్యేలు ఓట్లు అసవరం. అయితే, గడిచిన ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితికి వచ్చిన 39 స్థానాల్లో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, ఆ స్థానానికి బీఆర్‌ఎస్ కోల్పోయింది. మిగిలిన 38 స్థానాలతో బీఆర్‌ఎస్‌కు రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవచ్చు. కానీ, పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. వీరిపై ఇప్పటికీ పోరాటాన్ని బీఆర్‌ఎస్ సాగిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్లం వర్తింపజేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్ వెళ్లింది. అయితే, ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక అస్ర్తాన్ని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని బట్టి ఒకే ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని బరిలోకి దించాలి. కానీ, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో నెట్టేందుకు రెండో అభ్యర్థిని బీఆర్‌ఎస్ బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్థులను కూడా కేసీఆర్ ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని విఫ్ జారీ చేయనున్నారు.
ఈ విఫ్ ధిక్కరించిన వారిపై వేటు వేసేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఆధారంగా చూపించి వారిపై వేటు వసే వ్యూహాలను కేసీఆర్ పన్నుతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థికే ఓటు వేస్తారని కేసీఆర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణ మోహన్ తాను కాంగ్రెస్ పార్టీ కాదని ప్రకటించారు. ఇదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా బీఆర్‌ఎస్ నిలబెట్టే అభ్యర్థికి ఓటు వేస్తారని కేసీఆర్‌కు సమాచారం వచ్చిందని, అందువల్లే అనూహ్యంగా రెండో అభ్యర్థిని బరిలో దించేందుకు కేసీఆర్ సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను వినియోగించుకునేందుకు కేసీఆర్ సిద్ధపడుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు సులభంగా దక్కించుకోవచ్చని భావించిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా భారతీయ రాష్ట్ర సమితి వ్యూహంతో ఎన్నికల ప్రణాళికలను రచించుకోవాల్సిన పరిస్థితిని కాంగ్రెస్‌కు ఏర్పడేలా కేసీఆర్ చేశారు. ఇప్పుడు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించుకోవడం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారుకు తలకుమించిన పనిగా చెబుతున్నారు. కేసీఆర్ తాజా నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.