||బ్రాహ్మణతత్వ వృద్ధికి ధార్మిక వేడుకలు అవసరం: అరసవెల్లి దేవాలయ ప్రధాన అర్చకుడు శంకర శర్మ||
(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
బ్రాహ్మణ తత్వాన్ని వృద్ధి చేసే క్రమంలో కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన లాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అరసవెల్లి దేవాలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని కంబాలపేట జంక్షన్ కొబ్బరితోటలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన శంకర శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ ఐక్యతకు కార్తీక వన సమారాధనలు దోహదం చేస్తాయని, బ్రాహ్మణ ఐక్యతకు సాధ్యమవుతుందని అన్నారు. బ్రాహ్మణులందరూ ఆధ్యాత్మిక వేడుకలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాసులు మాట్లాడుతూ తమ సమాఖ్య రెండు రాష్ట్రాలలో కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తోందని, అతి త్వరలోనే దేశంలో అన్ని రాష్ట్రాల్లోని బ్రాహ్మణులను ఏకీకృతం చేసి, భారీ కార్యక్రమానికి ప్రణాళికలు రూపుదిద్దుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో బ్రాహ్మణ సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉపాధ్యక్షుడు కిషన్ రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకోవాలని, వారికి విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక సహాయ కార్యదర్శి నేరెళ్ల మల్లికార్జున్ మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యక్రమాల కోసం బ్రాహ్మణులందరూ ఎదురుచూసే విధంగా వేడుకలు ఉంటాయ,ని ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యిందని, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ హాస్పిటల్స్, డయాగ్నస్టిక్స్ సెంటర్లలో రాయితీలతో ఒప్పందం గురించి ప్రతి బ్రాహ్మణులు తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బ్రాహ్మణ నాయకుడు డాక్టర్ల ఫణికుమార్ మాట్లాడుతూ జేఆర్ పురం లావేరు మండలం బ్రాహ్మణులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని, దాదాపు 500 మంది బ్రాహ్మణ బంధువులు ఈ వేడుకల్లో పాల్గొనడం అద్భుతం అని అన్నారు. ఈ సభలో సూరిబాబు, నరసింహమూర్తి, బాలకృష్ణ, నాని పంతులు, బాలకృష్ణ శర్మ ప్రసంగించారు. అనంతరం డాక్టర్ ఫణికుమార్‌ను బ్రాహ్మణ సంక్షేమ వేదిక శ్రీకాకుళం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాసులు నియామక పత్రాన్ని సభికుల హర్షద్వానాల మధ్య అందజేశారు. కార్యక్రమానికి ముందు చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.