నేడు జమిలి బిల్లు ప్రవేశపెట్టనున్న బిజెపి.. ఎంపీలుకు విప్ జారీ చేసిన కాంగ్రెస్

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్న ఉద్దేశంలో బిజెపి ఉంది. అందుకు అనుగుణంగానే మంగళవారం లోక్ సభలో జమిలి బిల్లును బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. అందుకు అనుగుణంగా బిజెపి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్న ఉద్దేశంలో బిజెపి ఉంది. అందుకు అనుగుణంగానే మంగళవారం లోక్ సభలో జమిలి బిల్లును బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. అందుకు అనుగుణంగా బిజెపి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బిజెపి లోక్సభలో జమిలి బిల్లును ప్రవేశపెడుతుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమాత్రమైంది. తమ పార్టీకి చెందిన ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఎంపీలంతా సభకు హాజరు కావాలని కోరింది. సభకు వెళ్లే ముందు జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. జెమిని ఎన్నికలకు సంబంధించి 129 వ రాజ్యాంగ బిల్లు -2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు - 2024 ను కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టబోతోంది.

ఈ మేరకు వాటిని లోక్సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జె పి సి) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్ను మంత్రి అభ్యర్థించనున్నారు. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పించనున్నారు. బిజెపి ఎంపీల్లో ఒకరిని చైర్మన్గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలు అందరితో చర్చించిన తరువాత కమిటీ తొమ్మిది రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే పరిస్థితులను బట్టి గడువును మరింతకాలం పొడిగించనున్నారు. ఈనెల 20వ తేదీతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగినున్నాయి. ఈ నేపథ్యంలోనే జెమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్లు బిజెపి నాయకులు జాతీయ మీడియాకు సమాచారాన్ని అందించారు. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతు ఇవ్వగా, 15 పార్టీలు వ్యతిరేకించినట్లు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్