ఢిల్లీ ప్రజలపై బిజెపి వరాల జల్లు.. ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల

ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ఢిల్లీ ప్రజలకు అనేక వరాలను బిజెపి కురిపించింది. ప్రధానంగా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని బిజెపి అనేక హామీలను ఇచ్చింది. శుక్రవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి విజయమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక హామీలను ప్రకటించింది.

BJP National President JP Nadda

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ఢిల్లీ ప్రజలకు అనేక వరాలను బిజెపి కురిపించింది. ప్రధానంగా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని బిజెపి అనేక హామీలను ఇచ్చింది. శుక్రవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి విజయమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక హామీలను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను సంకల్ప్ పాత్ర పేరుతో బిజెపి విడుదల చేసింది.  వికసిత్ ఢిల్లీ కోసం రోడ్డు మ్యాప్ అని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జేపీ నడ్డా పేర్కొన్నారు. ఢిల్లీని అవినీతి రహితంగా మార్చడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంకల్ప్ పాత్ర అభివృద్ధికి పునాది అని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు.

ఇవి ప్రధానమైన అంశాలు 

భారత జనతా పార్టీ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రముఖంగా చెప్పుకుంటున్న వాటిలో మహిళా సమాన్ నిధి పేరుతో ప్రతి నెల మహిళలకు రూ.2500 రూపాయల ఆర్థిక సాయం, వేద మహిళలకు రూ.500 కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, హోలీ, దీపావళికి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళలకు ఆరు పోషకాహారాలతో కూడిన కిట్లు పంపిణీ, గర్భిణీలకు రూ.21 వేల రూపాయల ఆర్థిక సాయం, వృద్ధాప్య పెన్షన్ పెంపు వంటి కీలక హామీలు ఉన్నాయి. 2014లో 500 వాగ్దానాలు ఇస్తే 499 అమలు చేశామని, 2019లో 235 హామీలు ఇస్తే 225 అమలు చేశామని, మిగిలినవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా జేపీ నడ్డా పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంతో పాటు అవినీతి రహితంగా మారుస్తామని జెపి నడ్డా వెల్లడించారు. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆప్ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రాష్ట్రాన్ని గెలుచుకోవడం ద్వారా తమ సత్తా మరోసారి చాటాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే భావిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులను అక్కడ మోహరిస్తోంది. అన్ని పార్టీలు కూడా మహిళలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలను అమలు చేస్తున్నాయని ప్రచారం తోలి నుంచి ఉంది. అందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఆ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్