కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ జోరుగా సాగుతోంది. 2027లో ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ మేరకు అన్ని పార్టీలను ఒప్పించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కీలక ఆదేశాలను జారీ చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరింత ఫోకస్ పెట్టిన బిజెపి.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
జేపీ నడ్డా
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ జోరుగా సాగుతోంది. 2027లో ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ మేరకు అన్ని పార్టీలను ఒప్పించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కీలక ఆదేశాలను జారీ చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరింత ఫోకస్ పెట్టిన బిజెపి.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. మాటిమాటికి వచ్చే ఎన్నికలతో నష్టం జరుగుతున్న తీరును ప్రజలకు వివరించాలని బిజెపి ఎంపీలకు జేపీ నడ్డా తాజాగా సూచించారు. ఆయన సూచనలతో భారతీయ జనతా పార్టీ మరింత పకడ్బందీగా జమిలి ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళుతోందన్న భావన వ్యక్తం అవుతోంది. బూత్ స్థాయి నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని జేపీ నడ్డా సూచించారు. జమిలి ఎన్నికలపై పార్టీ ఎంపీలకు వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు. జమిలి ఎన్నికలను నిర్వహించడం వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దేశమంతటా ఒకేసారి లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి అంతరాయం ఉండదనీ బిజెపి భావిస్తోంది. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా దేశమంతా ఒకేసారి ఎన్నికల జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించాలని జెపి నడ్డ తాజాగా పార్టీ ఎంపీలకు సూచించారు. కేంద్రంలో ఉండే పార్టీకి ప్రయోజనమని, ప్రాంతీయ పార్టీలకు నష్టమనే వాదనలో పసలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలను ఒప్పించే ప్రయత్నంలో బిజెపి..
జమిలి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలన్న ఉద్దేశంలో బిజెపి ఉంది. ఎందుకు వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు పార్టీలను ఒప్పించేలా చేయడంతోపాటు ప్రజలకు అవగాహన కలిగించేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. ఈ బాధ్యతలను ఎంపీలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అప్పగించారు. తాజా ఆదేశాలను బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ జమిలి ఎన్నికల విషయంలో పగడ్బందీగా ముందుకు వెళుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమిలి ఎన్నికల నిర్వహణ విషయంలో గట్టిగా ఉండడంతో ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఎంపీలకు అప్పగించారు. దీనివల్ల ఆర్థికంగానూ నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు అన్న భావన బిజెపిలో ఉంది. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఎన్నికలు నిర్వహిస్తూ ఉండడం వల్ల పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని బిజెపి గుర్తించింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ తరహా ఇబ్బందులకు అవకాశం ఉండదని బిజెపి భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి జెమిని ఎన్నికలను నిర్వహించేందుకు బిజెపి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే బిజెపి ఎంపీలకు జేపీ నడ్డా కీలక ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు.