బిజెపి రాజ్యసభకు అభ్యర్థులను ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా మూడు చోట్ల బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను తాజాగా ప్రకటించింది. ఇందులో ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాల్లో ఒకటి బిజెపికి దక్కింది. ఈ స్థానాన్ని ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు బిజెపి అధిష్టానం కేటాయించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన బిజెపి అధిష్టానం, హర్యానా నుంచి రేఖ శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది.
ఆర్.కృష్ణయ్య
బిజెపి రాజ్యసభకు అభ్యర్థులను ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా మూడు చోట్ల బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను తాజాగా ప్రకటించింది. ఇందులో ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాల్లో ఒకటి బిజెపికి దక్కింది. ఈ స్థానాన్ని ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు బిజెపి అధిష్టానం కేటాయించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన బిజెపి అధిష్టానం, హర్యానా నుంచి రేఖ శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేతగా పేరుగాంచిన ఆర్ కృష్ణయ్యకు గతంలో వైసిపి రాజ్యసభ స్థానాన్ని కేటాయించి పెద్దల సభకు పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాభవాన్ని చవిచూడడంతో ఆర్ కృష్ణయ్య రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన అదే స్థానం నుంచి మళ్లీ ఎన్నిక అయ్యేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగించారు. ఇందుకోసం గడిచిన కొన్నాల్ల నుంచి బిజెపి అగ్ర నాయకులతో టచ్ లో ఉన్నారు. చర్చలు ఫలించడంతో బీజేపీ అగ్రనాయకత్వం ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాల్లో ఒక స్థానానికి ఆర్.కృష్ణయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్కు తుది గడువు మంగళవారంతో ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే బిజెపి అధినాయకత్వం సోమవారం ఏపీతోపాటు మిగిలిన రెండు రాష్ట్రాల్లో తమకు దక్కిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి తరపున ఏపీలో ఖాళీ అయిన మూడు స్థానాలకు రేపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బిజెపి తరఫున ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు. బిజెపి అగ్రనాయకత్వం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్ కృష్ణయ్య, వేద మస్తాన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మూడో అభ్యర్థిత్వాన్ని ఇంకా కూటమి ఖరారు చేయలేదు. ఈ స్థానం కోసం టిడిపిలో తీవ్రమైన పోటీ నెలకొంది. పలువురు నేతలు తీవ్రంగా ఈ స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సానా సతీష్, కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్ధన్ వంటి నేతలు ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో టిడిపి అధిష్టానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే హైదరాబాదులోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి పెద్ద ఎత్తున ఆశావహులు క్యూ కొడుతున్నారు. టిడిపి అగ్ర నాయకత్వం కూడా సోమవారం సాయంత్రం నాటికి మూడో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.