ప్రజల్లో బీజేపీ బలం పెరిగింది: శూరకర్ణారెడ్డి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||శూరకర్ణారెడ్డి||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

మహేశ్వరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రాభవాన్ని పెంచుకుందని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి శూరకర్ణ రెడ్డి అన్నారు. అందుకు కారణం కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలోకి చేరడమే కారణమని చెప్పారు. బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ చివరి వరకూ బీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చారని వెల్లడించారు. ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. గత రెండు నెలలుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. అల్మాస్ గుడాలో గతంలో కంటే భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు పెరిగింది తప్ప తగ్గలేదని ఇదే ఉత్సాహంతో పనిచేసే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో యువత భారత ప్రధానిని మళ్లీ ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం గట్టెక్కించగలదాఅనే ప్రశ్న ఉదయిస్తుందని అన్నారు.

గెలుపు ఓటమిలో రాజకీయాల్లో సహజమైనా ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారని, భారత రాష్ట్ర సమితిని వద్దనుకున్నారని, కేసీఆర్ కు సెలవు చెప్పాలని నిర్ణయించుకున్నారని, అందుకు నిదర్శనమే ఇటీవల ఫలితాలు అని అన్నారు. ఇటీవల 19 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు రెండవ స్థానంలో నిలిచారని, ఇందులో పాతబస్తీలోనే సెగ్మెంట్లు కూడా ఉండడం విశేషం అని తెలిపారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్లలో బిజెపి అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారని, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో కూడా గట్టి పోటీ ఇస్తూ చివరి వరకు బరిలో నిలిచిన అందెల శ్రీరాములు యాదవ్ స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమిపాలయ్యారని వివరించారు. అంచనాలు లేని దశ నుండి ఈసారి రాష్ట్రంలో 8 సీట్లు సాధించడం మరో విజయమని అన్నారు. యువత అంతా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి మళ్లీ పట్టం కట్టాలని కోరారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్