సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు వేలిముద్రలు మిస్ మ్యాచ్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ దాడి ఘటన అనంతరం అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని విచారించిన పోలీసులకు తాజాగా షాక్ కు గురి చేసే వ్యవహారం ఒకటి తెలిసింది. ఈ కేసులో ఈ పరిణామాల్ని బిగ్ ట్విస్ట్ గా పోలీసులు పేర్కొంటున్నారు. నిందితుడి వేలి ముద్రలు ఒక్కటి కూడా సరిపోవడంలేదని తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ దాడి ఘటన అనంతరం అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని విచారించిన పోలీసులకు తాజాగా షాక్ కు గురి చేసే వ్యవహారం ఒకటి తెలిసింది. ఈ కేసులో ఈ పరిణామాల్ని బిగ్ ట్విస్ట్ గా పోలీసులు పేర్కొంటున్నారు. నిందితుడి వేలి ముద్రలు ఒక్కటి కూడా సరిపోవడంలేదని తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది. బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి ప్రయత్నించి.. సైఫ్ పై దాడి చేసిన నిందితుడు షరిఫుల్ ఇస్లాం వేలిముద్రలు మిస్ మ్యాచ్ అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ సేకరించిన 19 సెట్ల వేలి ముద్రలు నిందితుడితో సరిపోలడం లేదు. దీంతో విచారణ ప్రక్రియ మరోసారి మొదటికి వచ్చినట్టు అయిందని చెబుతున్నారు. ముంబై పోలీసులు మిస్టర్ ఖాన్ ఇంట్లో దొరికిన వేలి ముద్రలను రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి)కు చెందిన వేలిముద్రల బ్యూరోకు పంపించారని తెలిపాయి.

నివేదిక ప్రకారం ఆ వేలి ముద్రలు షరీఫుల్ వేలిముద్రలతో సరిపోలడం లేదని తేలింది. పరీక్ష ఫలితం ప్రతికూలంగా ఉందని సిఐడి ముంబై పోలీసులకు తెలియజేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ముంబై పోలీసులు మరిన్ని పరీక్షల కోసం నమూనాలను పంపించినట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 15న బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం కత్తితో దాడికి పాల్పడ్డాడు. సైఫ్ ఇంట్లోకి చొరబడి ఈ దాడికి యత్నించాడు. సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. వెన్నుముకలో కత్తి విరిగింది. వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఈ దాడి అనంతరం నిందితుడు పారిపోయాడు. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముంబై పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు పెద్ద ఎత్తున చర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దాడి జరిగిన 70 గంటల తర్వాత నిందితుడిని థానేలో పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులకు తాజా వ్యవహారం మింగుడు పడడం లేదు. దీంతో ఈ కేసు విచారణ ప్రక్రియ మళ్ళీ మొదటకు వచ్చినట్టు అయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్