బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. అర్ధరాత్రి కాంగ్రెస్ గూటికి చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

గత ఏడాది తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత భారతీయ రాష్ట్ర సమితి పరిస్థితి అధ్వానంగా తయారైంది. రెండు పర్యాయాలు ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళుతున్నారు.

CM Revanth and other leaders with MLCs

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్, ఇతర నాయకులు


గత ఏడాది తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత భారతీయ రాష్ట్ర సమితి పరిస్థితి అధ్వానంగా తయారైంది. రెండు పర్యాయాలు ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళుతున్నారు. వలసలకు అడ్డుకట్టు వేసేందుకు కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఏవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక బిఆర్ఎస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుపోగా, బీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ పార్టీ పుండుపై కారం చల్లినట్టుగా గురువారం అర్ధరాత్రి తర్వాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇది ఇప్పుడు బిఆర్ఎస్ కు బిగ్ షాక్ గా మారింది. ఇప్పటి వరకు భారతీయ రాష్ట్ర సమితి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా, తాజాగా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, బసవరాజు సారయ్య, దండే విఠల్, ఎమ్మెస్ ప్రభాకర్, యెగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ ఉన్నారు. వీళ్లంతా రాత్రి ఒంటి గంట సమయంలో హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో కేసిఆర్ కు టాటా చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ చేరికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతోపాటు మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 

ఇప్పటి వరకు భారతీయ రాష్ట్ర సమితి నుంచి కారు గుర్తుపై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరింత మంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై భారతీయ రాష్ట్ర సమితి ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా బిఆర్ఎస్ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల నుంచి పార్టీని కేసీఆర్ ఎలా గట్టెక్కిస్తారో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్