భారతదేశ మొబైల్ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తాజాగా తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యాధునిక ఫీచర్లు, నమ్మకమైన పనితీరు భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మొబైల్స్ ను రూపొందిస్తున్న లావా సంస్థ ప్రత్యేకంగా లావా డేస్ సేల్ ప్రకటించింది. ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 27 వరకు అమెజాన్ ఇండియాలో ఈ లావా డేస్ సేల్ నిర్వహిస్తున్నారు. ఇందులో లావా 03, లావా 03 ప్రో స్మార్ట్ ఫోన్ లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
భారతదేశ మొబైల్ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తాజాగా తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యాధునిక ఫీచర్లు, నమ్మకమైన పనితీరు భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మొబైల్స్ ను రూపొందిస్తున్న లావా సంస్థ ప్రత్యేకంగా లావా డేస్ సేల్ ప్రకటించింది. ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 27 వరకు అమెజాన్ ఇండియాలో ఈ లావా డేస్ సేల్ నిర్వహిస్తున్నారు. ఇందులో లావా 03, లావా 03 ప్రో స్మార్ట్ ఫోన్ లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా ఫోన్లకు సంబంధించి అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లు, ఫోన్ ఫీచర్ల గురించి మీరు తెలుసుకోండి.
లావా 03 ఫోన్ ఏప్రిల్ 23 నుంచి 27 వరకు ప్రత్యేక ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ లో 4+64 GB వేరియంట్ అసలు ధర రూ.6,199 కాగా, ఇప్పుడు 300 కూపన్ డిస్కౌంట్ తో రూ.5,899 కే లభిస్తుంది. అలాగే 3 + 64 GB వేరియంట్ అసలు ధర రూ.5,799 కాగా, 150 కూపన్ డిస్కౌంట్ తో రూ.5,649 కి లభిస్తుంది. అలాగే, లావా 03 ప్రో ఫోన్ కు సంబంధించి ఏప్రిల్ 23 నుంచి 27 వరకు ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా 4+128 GB అసలు ధర రూ.6,999 కాగా, 300 డిస్కౌంట్ తో కేవలం రూ.6,699 కి లభిస్తోంది. ఈ లావా డేస్ సేల్ ఏప్రిల్ 23 నుంచి 27 వరకు అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ కు తగిన ఫోను ఎంచుకునేందుకు ఇదే మంచి అవకాశం. విభిన్నమైన ఫీచర్లతో కూడిన లావా ఫోన్ లను తక్కువ ధరకే అందించేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులను సంస్థ కోరింది.