బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడు రోజులపాటు భారీగా కురవనున్న వర్షాలు

అల్పపీడనం బలపడి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా రానున్న క్రమంలో ఈ నెల 15 నుంచి 17 వరకు కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుంది. అయితే బలపడి తీవ్ర అల్పపీడనంగానే తీరం దాటుతుందా.? లేదా మరింత బలపడి వాయుగుండంగా మారనుందా.? అనేదానిపై అధికారుల స్పష్టత ఇవ్వడం లేదు.

rain

కురుస్తున్న వర్షం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఆవరించి ఉంది. రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం బలపడి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా రానున్న క్రమంలో ఈ నెల 15 నుంచి 17 వరకు కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుంది. అయితే బలపడి తీవ్ర అల్పపీడనంగానే తీరం దాటుతుందా.? లేదా మరింత బలపడి వాయుగుండంగా మారనుందా.? అనేదానిపై అధికారుల స్పష్టత ఇవ్వడం లేదు. కొన్ని మోడల్స్ ప్రకారం వాయుగుండంగా మారి ఈ నెల 17న తీరం దాటుతుందని, కొన్ని మోడల్స్ ప్రకారం తుఫానుగా మారుతుందని అంచనాలు ఉన్నాయి. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటిన తరువాత దక్షిణ భారతం మీదుగా పై నుంచి అరేబియా సముద్రంలో ప్రవేశించి అక్కడ బలపడుతుందని కొన్ని మోడల్స్ విశ్లేషిస్తున్నాయి. అయితే అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత కొంత వరకు స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో వర్షాలకు ఊతమిచ్చే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. దీనికి బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు దేశం నుంచి ఇక వైదొలగనున్నాయి. ఆదివారం మధ్య, తూర్పు భారతంలో అనేక ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. రానున్న రెండు రోజుల్లో దేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాలు వైదొలుగుతాయని, ఇదే సమయంలో ఈ నెల 15 లేదా 16 తేదీల్లో దక్షిణాదిలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడితే బలపడే అవకాశం ఉన్నందున రానున్న 48 గంటలపాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వల్ల వద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్