తెలంగాణలోని గ్రూప్ -1 అభ్యర్థులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వెబ్సైట్లో టీజీపీఎస్సీ పేర్కొంది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన ప్రక్రియను నిర్వహించనున్నారు. పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలని టీజీపీఎస్సీ సూచించింది. ఈ పోస్టులు భర్తీ ప్రక్రియను గతంలోనే కెసిఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టారు. 2022 ఏప్రిల్ గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలోని గ్రూప్ -1 అభ్యర్థులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వెబ్సైట్లో టీజీపీఎస్సీ పేర్కొంది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన ప్రక్రియను నిర్వహించనున్నారు. పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలని టీజీపీఎస్సీ సూచించింది. ఈ పోస్టులు భర్తీ ప్రక్రియను గతంలోనే కెసిఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టారు. 2022 ఏప్రిల్ గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అదే ఏడాది అక్టోబర్ నెలలో ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించారు. 1:50 నిష్పత్తిలో టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ అవడంతో ఆ పరీక్షను రద్దు చేశారు.
ఆ తర్వాత 2023 జూన్ 11న రెండోసారి రిలీజ్ పరీక్షను నిర్వహించారు. అప్పుడు కూడా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయి అంటూ కొందరు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు వెన్న ధర్మాసనం పరీక్షను రద్దు చేయాలని కూడా ఆదేశించింది. దీంతో రెండోసారి నిర్వహించిన పరీక్ష కూడా రద్దు అయింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన రేవంత్ సర్కార్ 60 పోస్టులను కొత్తగా కలిపి మొత్తంగా 563 పోస్టులతో మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేతృత్వంలోని టీజీపీఎస్సీ. మెయిన్స్ పరీక్షకు 21,093 మంది అభ్యర్థులు హాజరు కాగా వీటికి సంబంధించిన ఫలితాలు కూడా మార్చి పదిన టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఆ తర్వాత ఇటీవల గ్రూపు పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల జనాల ర్యాంకింగ్ లిస్టును కూడా టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలోనే గ్రూపు 1 ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ప్రకటించింది. నాలుగు రోజులు పాటు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని వెబ్సైట్లో పేర్కొంది. ఎందుకు సంబంధించి అభ్యర్థుల సిద్ధం కావాలని టీజీపీఎస్సీ వెల్లడించింది.