పిఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

ఈపీఎఫ్ ఖాతాలను సమర్థంగా నిర్వహించేలా ఈపీఎఫ్ వోకు కేంద్రం ఇటీవల కీలక ఆదేశాలను జారీ చేసింది. పిఎఫ్ పథకంలో ఖాతాదారులందరూ తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ల (యుఏఎన్) ను ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని అమలకు ఆయా యాజమాన్యాలతో కలిసి పని చేయాలని ఈపీఎఫ్ వొకు ఆదేశించింది.

Epf

ఈపీఎఫ్

ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు కోసం ఆయా యాజమాన్యాలు ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకాన్ని అమలు చేస్తాయి. ప్రతినెల ఉద్యోగి జీతం నుంచి కొంత మాత్రం దీనిలో జమ అవుతుంది. యాజమాన్యం కూడా తమ వంతు డబ్బులు చెల్లిస్తుంది. పీఎఫ్ ఖాతాదారులకు ప్రతినెల పెన్షన్ కూడా వస్తుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) ఆధ్వర్యంలో వీటి నిర్వహణ జరుగుతుంది. ఈపీఎఫ్ ఖాతాలను సమర్థంగా నిర్వహించేలా ఈపీఎఫ్ వోకు కేంద్రం ఇటీవల కీలక ఆదేశాలను జారీ చేసింది. పిఎఫ్ పథకంలో ఖాతాదారులందరూ తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ల (యుఏఎన్) ను ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని అమలకు ఆయా యాజమాన్యాలతో కలిసి పని చేయాలని ఈపీఎఫ్ వొకు ఆదేశించింది. 2024-25 యూనియన్ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకం అమలులో భాగంగా ఈ చర్యలను చేపట్టినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలను సమర్ధవంతంగా అమలు చేయడానికి జోనల్, ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయాలు కూడా రంగంలోకి దిగాయి. 

యుఎన్ఎ యాక్టివేషన్ తో ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఖాతాలను మెరుగ్గా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.  అన్ని ప్రయోజనాలను పొందేందుకు దీనివల్ల అవకాశం ఉండనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాస్ బుక్కులను తనిఖీ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం, నగదు ఉపసంహరణ, బదిలీలకు క్లైమ్ చేసుకునేందుకు చాలా సులభంగా ఉంటుంది. అదే సమయంలో వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే వీలు లభిస్తుంది. దీని ద్వారా వివిధ పనులపై పిఎఫ్ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది పీఎఫ్ ఖాతాదారులకు ఎంతగానో మేలు చేకూర్చనుంది. 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యాలు ఈ ఏడాది నవంబర్ 30 నాటికి కొత్త ఉద్యోగులకు ఆధార ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ ను ఆక్టివేట్ చేయాలి. ఆ తరువాత మిగిలిన ఉద్యోగులందరికీ ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ పథకాలను లబ్ధిదారుడికి అందించే క్రమంలో 100% బయోమెట్రిక్ ప్రామాణికీకరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలను వారి చేసింది. యూఏఎన్ నెంబర్ ఒకటే ఉంటుంది. ఉద్యోగి ఎన్ని సంస్థలు మారినా అదే నెంబర్ తో పిఎఫ్ అకౌంట్ కొనసాగుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్