తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి.. ఏ రంగాలకు ఎంతెంత కేటాయించారంటే.!

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం బడ్జెట్ సమావేశాల్లో మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా భట్టి పేర్కొన్నారు. తెలంగాణ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. తమపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని, అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు.

Bhatti Vikramarka, Minister of Budget

బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం బడ్జెట్ సమావేశాల్లో మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా భట్టి పేర్కొన్నారు. తెలంగాణ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. తమపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని, అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు గా వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. బడ్జెట్ ను మంత్రి బట్టి విక్రమార్క 3.4 లక్షల కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా భట్టి విక్రమార్క ప్రకటించారు.

ఇక బడ్జెట్ కు సంబంధించి వివిధ శాఖలకు కేటాయించిన కేటాయింపులను పరిశీలిస్తే.. బీసీ అభివృద్ధికి రూ.11,405 కోట్లు, చేనేత రంగానికి రూ.371, పౌరసరఫరాల శాఖ రూ.5,734 కోట్లు, విద్య రూ.23,108 కోట్లు, పంచాయతీ & రూరల్ డెవలప్మెంట్ రూ.31,605 కోట్లు, రైతు భరోసా రూ.18,000 కోట్లు, మహిళా శిశు సంక్షేమం రూ.2,862 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,674 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు, ఎస్సీ అభివృద్ధికి రూ.40,232 కోట్లు, ఎస్టి అభివృద్ధికి రూ.17,169 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,591 కోట్లు, విద్యాశాఖకు రూ.23,108 కోట్లు, షెడ్యూల్ కులాలకు రూ.40,232 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,862 కోట్లు, కార్మిక ఉపాధి కల్పనకు రూ.900 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.5,907 కోట్లు, షెడ్యూల్ తెగలకు రూ.17,169 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.23,373 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.11,405 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.21,221 కోట్లు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,677 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.190 కోట్లు కేటాయించారు. అలాగే హోంశాఖకు రూ.10,188 కోట్లు, పర్యాటక శాఖకు రూ.775 కోట్లు, క్రీడా శాఖకు రూ.465 కోట్లు, అడవులు, పర్యావరణ శాఖకు రూ.1063 కోట్లు కేటాయించారు. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. మహిళా శక్తి భవనాల ఏర్పాటుకు రూ.110 కోట్లు, 214 మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. గిరిజన అభివృద్ధి కోసం ఇందిరా గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు.

2.1 లక్షల గిరిజన రైతులకు పౌర ఆధారిత పంపుసెట్లు ఇవ్వనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ఒక గేమ్ చేంజర్ గా ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. యువ వికాసం పథకం లబ్ధిదారులకు నాలుగు లక్షలు ఆర్థిక సాయం అందించమన్నారు. 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లలో ఉచితంగా గ్రూప్ 1, 2 అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి భట్టి వెల్లడించారు. గృహ జ్యోతి పథకంతో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అలాగే గృహ జ్యోతి పథకంతో యాభై లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూర్చనున్నారు. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గానికి కనీసం 3,500 నిర్మించనున్నారు. రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రజా భవన్ ప్రాంగణంలో ఉన్న ఆలయంలో బడ్జెట్ ప్రజలతో పూజలు చేశారు. పూజల్లో భట్టి దంపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి అసెంబ్లీకి బయలుదేరి వచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భారతీయ రాష్ట్ర సమితి నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలు మధ్య నినాదాలు, వ్యతిరేక నినాదాలతో మార్మోగిపోయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్