పెట్టుబడి ఖర్చు తెలవకుండా మద్దతు ధర ఎలా?: యర్రం వెంకటరెడ్డి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||యర్రం వెంకటరెడ్డి||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో వరి కోతల పనులు వేగవంతం అయినా ప్రభుత్వం ప్రకటించిన మేరకైనా కొనుగోలు కేంద్రాలను మార్కెట్లను పూర్తిస్థాయిలో ప్రారంభించి నడిపినట్లు దాఖలాలు లేవు అని భారతీయ కిస్వామ్ సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి యర్రం వెంకటరెడ్డి అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అదే విధంగా పత్తి కొనుగోలుకు సిసిఐ ద్వారా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మొక్కజొన్నలు తదితర పంటల స్థితి కూడా దీనికి ఏమీ తీసిపోలేదని అన్నారు. దీనితో ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్ లేదనో మరి ఏదో కారణాలు చెప్పి రైతుల దగ్గర అతి తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు. రైతులను నీవు నా దోచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయించిన ధర తక్కువ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దారిని కూడా నోచుకోరి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిసిఐ పౌరసరఫలాల శాఖ మార్క్ ఫేడ్ శాఖలు కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కొనుగోలు సరిగా లేక ఇప్పటికే మొక్కజొన్నలు వరి ధాన్యం రోడ్లమీద ఆరబోసిన దృశ్యాలు ప్రతి జిల్లాలో కనబడుతున్నాయని అన్నారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో రైతులకు 65 లక్షల ఎకరాలలో వరి వేశారని సాగు ద్వారా 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా అని అందులో 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఇందుకోసం 700 కొనుగోలు కేంద్రాలు అవసరం అవుతాయని అన్నారు. పత్తికి సంబంధించి వాతావరణ మార్పులకు తోడు చీడపీడలు ఎక్కువగా సౌకడంతో రైతులు అధిక దిగుబడి బాగా తగ్గిందని వర్షాలు లేని కారణాలు వల్ల సాగు విస్తీర్ణం కూడా తగ్గిందని పెట్టుబడులు పెరిగాయని రాష్ట్రంలో వరి తరువాత పత్తి ప్రధాన పంట అని ఖరీఫ్ లో సాధారణ సాగు 50,59,225 ఎకరాలు కాగా సరైన వర్షాలు లేనందున 45,03,327 ఎకరాలలో సాగు చేయవలసి వచ్చిందని ఈ పంటను రక్షించుకోవడానికి రైతాంగం నానా తంటాలు పడవలసిన పరిస్థితి ఏర్పడిందని అయినా దిగుబడి తగ్గి నష్టం వస్తుందని అన్నారు.

పంట ఖర్చులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంకెనా ప్రకారం వరి సాధారణ రకాలు క్వింటాలుకు 3,300 ఏ గ్రేడ్ రకాలకు 3,400 పత్తి క్వింటాలుకు 11,000 మొక్కజొన్నలు క్వింటాలు 2000 ఖర్చు అవుతుందని అంకెన వేసింది దీనికి అనుగుణంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం వరి సాధారణ రకాలకు సమగ్ర ఖర్చుల మీద లాభం 50 శాతం అదనంగా కలిపి క్వింటాలుకు 4950 ఏ గ్రేడ్ రకాలకు 5,100 పత్తి కింటాలుకు 18,500 కనీస మద్దతు ధర నిర్ణయించమని కేంద్రం కోరిందని కానీ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దానికి సాధారణ రకాలకు 2,183, ఏ గ్రేడ్ రకాలకు 2203,0 పత్తి 7020 మాత్రమే ప్రకటించిందని ఇలా 14 రకాల పంటలకు ప్రకటించింది అని అన్నారు ఈ మధ్యనే రబీ పంటలు ఆరు రకాల కనీసం మద్దతు ధర ప్రకటించిందని ఇవన్నీ స్వామినాథన్ కమిషన్ ఫార్ములాకు భిన్నంగా ఉన్నాయని కనుక రైతు పెట్టుబడి ఖర్చులు కూడా పొందలేక అప్పుల పాలు అవుతున్నాడని2000-2017 ఈ మధ్యకాలంలో రైతాంగం దేశవ్యాప్తంగా 45 లక్షల కోట్లు నష్టపోయారని మద్దతు ధరల ఖరారు విధివిధానాలను సాకల్యంగా ప్రక్షాళన చేయాలని వైపే ఆలం కమిటీ చెప్పిందని ప్రొఫెసర్ అజిత్సేన్ కమిటీ మద్దతు ధరలను నిర్ధారించే పద్ధతిని తప్పు పట్టిందని పాలకులు ఇలాంటి విధానాలను మార్చుకోకపోతే రైతు ఆత్మహత్యలు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. కనుక ఖరీఫ్ పంటలన్నిటికీ స్వామినాథుని కమిటీ సిఫార్సుల ప్రకారం సమగ్ర పంటల ఖర్చు మీద 50% లాభం కలిపి కనీసం మద్దతు ధరలు నిర్ణయించి ప్రభుత్వమే ప్రధానంగా కొనుగోలు చేయాలని వెంకటరెడ్డి కోరారు.ఏకొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని రైతులకు అందుబాటులో ఉండేలాగా గ్రామపంచాయతీ మండల స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రైవేట్ వ్యాపారుల దోపిడీని అరికట్టాలని పంట పెట్టుబడును పెరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా సబ్సిడీ విధానం పూర్తిస్థాయిలో అమలు జరపాలని పట్టణ బీమా పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పేద మధ్యతరగతి రైతుల తరఫున ప్రీమియం ప్రభుత్వమే ధరించి అమలు చేయాలని వడ్డీ లేని రుణాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కనీస మద్దతు ధరను సవరించకపోతే ప్రకటించిన ధరలకు రైతు పంటలపై పెట్టిన ఖర్చులకు మధ్య గల నోటులు రాష్ట్ర ప్రభుత్వం బోనస్గా ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని యర్రం వెంకటరెడ్డి కోరారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్