సొంత ఇల్లు కట్టుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఎంతో మంది అప్పులు చేస్తుంటారు. బయట అప్పులు తీసుకోవాలి అంటే భారీగా వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఎంతో మంది తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు బ్యాంకులను ఆశ్రయిస్తారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఇంటి నిర్మాణానికి దిగుతుంటారు. అయితే బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేసేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి రుణం
సొంత ఇల్లు కట్టుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఎంతో మంది అప్పులు చేస్తుంటారు. బయట అప్పులు తీసుకోవాలి అంటే భారీగా వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఎంతో మంది తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు బ్యాంకులను ఆశ్రయిస్తారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఇంటి నిర్మాణానికి దిగుతుంటారు. అయితే బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేసేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రుణం తీసుకున్న మొత్తాన్ని ప్రతినెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (ఈఎంఐ) రూపంలో వడ్డీతో కలిపి చెల్లిస్తుంటారు. ఒకవేళ హోమ్ లోన్ ఈఎంఐ మిస్ అయితే బ్యాంకులు తీవ్రంగా పరిగణిస్తాయి. కొన్నిసార్లు పెనాల్టీలతోపాటు లేట్ ఫీజులు కూడా వసూలు చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బందికర పరిస్తితులు ఏమిటో మీరు తెలుసుకోండి. తొలిసారి లోన్ తీసుకునే వినియోగదారులు చాలా మంది సిబిల్ స్కోర్ ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఈ మూడు అంకెల సంఖ్య 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఇది క్రెడిట్ వర్తీనెస్ ను సూచిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. భవిష్యత్తులో లోన్ తీసుకోవడం సులభం అవుతుంది.
ఒకవేళ ఒక్క ఈఎంఐ మిస్ అయినా అది క్రెడిట్ స్కోర్ ను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో లోన్ పొందడం కష్టం కావచ్చు. లేదా లోన్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఈఎంఐ పేమెంట్స్ లేట్ అయినప్పుడు కొన్నిసార్లు భారీగా పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది తక్కువ శాతంగా అనిపించినప్పటికీ వడ్డీ ఊహించని విధంగా పెరుగుతుంది. దీంతో చెల్లించాల్సిన మొత్తం కూడా ఎక్కువ అవుతుంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి సకాలంలో ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి రుణాలకు సంబంధించిన ఈఎంఐ పేమెంట్స్ పదేపదే మిస్ చేస్తే మాత్రం ఇంటిని స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. బాకీ ఉన్న లోన్ బ్యాలెన్స్ ను రికవరీ చేసుకునే చట్టపరమైన హక్కు బ్యాంకులకు ఉన్న నేపథ్యంలో రుణం తీసుకున్న వ్యక్తులు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే ఆర్థిక సంస్థలు కేసు నమోదు చేసే అవకాశం ఉంది దీనివల్ల లీగల్ యాక్షన్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టు ఖర్చులు భారంగా మారుతాయి. అదే సమయంలో పరువు కూడా పోతుంది. సాధారణంగా హోమ్ లోన్లను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ ఈఎంఐ మిస్ అవుతూ ఉంటే మరో బ్యాంక్ కు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆమోదం పొందడం కష్టమవుతుంది. లోన్ రీపేమెంట్ మిస్ చేస్తే ఆర్థిక సంస్థలు రుణం తీసుకున్న వ్యక్తిని హైరిస్క్ బారోవర్ గా గుర్తిస్తాయి. దీంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటికి సంబంధించిన రుణాలు తీసుకున్నప్పుడు సమయానుగుణంగా చెల్లించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో రుణ గ్రహీతలు తగిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.