కొడితే మామూలుగా ఉండదు.. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మౌనం దాల్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎట్టకేలకు మౌనం వీడారు. సుమారు ఏడాది తర్వాత ఆయన రాజకీయంగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Former chief minister KCR speaking

మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మౌనం దాల్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎట్టకేలకు మౌనం వీడారు. సుమారు ఏడాది తర్వాత ఆయన రాజకీయంగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఈనెల 27న జహీరాబాద్ నుంచి పాదయాత్రగా శుక్రవారం ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని, గంభీరంగా చూస్తున్నానని వ్యాఖ్యానించారు. తాను కొడితే మామూలుగా ఉండదని హెచ్చరించారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలో వంచుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారని వ్యాఖ్యానించారు.

తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కు ఓటేశారని, ఇప్పుడు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఓటింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని, తాను చెప్పిన వినలేదన్నారు. అత్యాశకు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, మన విజయం తెలంగాణ విజయం కావాలన్నారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయని, ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఫిబ్రవరి నెల కరుణ భారీ బహిరంగ సభ పెడుతున్నామని పేర్కొన్నారు. మీరంతా తప్పకుండా రావాలని కెసిఆర్ వారికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుందని, సంగమేశ్వ, బసవేశ్వర టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్పై అంతట అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచేస్తుందని గజమెత్తారు. పాలనా వైఫల్యాలను ఎత్తిచూపితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రైతుబంధుకు రామ్ రామ్ చెప్పేశారని, దళిత బందుకు జై భీమ్ చెబుతారని ఆనాడే తాను చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. అన్ని మబ్బులు తొలగిపోయాయని, అన్ని బయటకు వస్తున్నాయన్నారు. మంచి, చెడులు ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు.  తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనని స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్