గడిచిన కొద్ది రోజుల నుంచి ఎండలు తీవ్రత పెరుగుతుంది. బుధవారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న కొద్దిరోజులపాటు ఇదే పరిస్థితి నెలకొననుంది. ప్రతిరోజు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఎండ వేడిమి, మరోవైపు ఒక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ద్రోని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిసాయి. దీంతో కాస్త ఉపశమనం కలిగినట్లయితే. అయితే తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో రానున్న రోజుల నుంచి మరింతగా ఎండ తీవ్రత నెలకొంటుందని పేర్కొంది.
ప్రతీకాత్మక చిత్రం
గడిచిన కొద్ది రోజుల నుంచి ఎండలు తీవ్రత పెరుగుతుంది. బుధవారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న కొద్దిరోజులపాటు ఇదే పరిస్థితి నెలకొననుంది. ప్రతిరోజు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఎండ వేడిమి, మరోవైపు ఒక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ద్రోని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిసాయి. దీంతో కాస్త ఉపశమనం కలిగినట్లయితే. అయితే తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో రానున్న రోజుల నుంచి మరింతగా ఎండ తీవ్రత నెలకొంటుందని పేర్కొంది. దక్షిణ చత్తీస్గడ్ నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పోరిగా అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వడగలు తీవ్రత తిరిగే అవకాశం ఉంది. బుధవారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 39.3 డిగ్రీలు, కనిష్టంగా నల్లగొండలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం కూడా తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఎండ తీవ్రత నెలకొంది. ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్నగర్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ లో మంగళవారం 38.3 డిగ్రీలు, భద్రాచలం 38 డిగ్రీలు, నిజామాబాద్ 37.3 డిగ్రీలు, ఖమ్మం 36.6, మహబూబ్ నగర్ 35.5, నల్లగొండలో 36 డిగ్రీలు, మెదక్ లో 35.6 డిగ్రీలు, హనుమకొండలో 35, హైదరాబాదులో 33.8° పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. బుధవారం 108 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలోని 15, విజయనగరం జిల్లాలో 21, పార్వతిపురం మన్యం జిల్లాలో 10, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 8, అనకాపల్లి జిల్లాలో ఏడు, కాకినాడలో ఏడు, కోనసీమ జిల్లాలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలో 13, ఏలూరు జిల్లాలో ఐదు, కృష్ణాజిల్లాలో రెండు, ఎన్టీఆర్ జిల్లాలో ఆరు, గుంటూరు జిల్లాలో మూడు, పల్నాడు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో వాడగాల్పులు వేసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 26 మండలాల్లో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా దారిమడుగులో 41.1 డిగ్రీలు, నెల్లూరు జిల్లా సోమశిల లో 40.9 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా పూతనవారి పల్లి, చిత్తూరు జిల్లా పిపల్లి, వైయస్సార్ జిల్లా అట్లూరులో 40.1 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. 15 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.