గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నారా జర జాగ్రత్త.. సైబర్ నేరగాళ్లతో పొంచి ఉన్న ప్రమాదం

సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం గూగుల్ క్రోమ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్, మ్యాక్ ఓఎస్ తో కనిపించే సెక్యూరిటీ రిస్కులతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి సెక్యూరిటీ రిస్కు గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (cert -in) సెప్టెంబర్ 26న ఒక అత్యవసర అలర్టును జారీ చేసింది.

Google Chrome

గూగుల్ క్రోమ్ 

సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడే నేరగాళ్లు వినూత్నమైన పంథాలను అనుసరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అనుసరిస్తూ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం గూగుల్ క్రోమ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్, మ్యాక్ ఓఎస్ తో కనిపించే సెక్యూరిటీ రిస్కులతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి సెక్యూరిటీ రిస్కు గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (cert -in) సెప్టెంబర్ 26న ఒక అత్యవసర అలర్టును జారీ  చేసింది. ఈ హెచ్చరిక ప్రకారం క్రోమ్ యూజర్లు హై రిస్క్ లో ఉన్నట్లు పేర్కొంది. 

'క్రోమ్ లో మల్టీపుల్ వల్నరబులిటీస్ కనిపించాయి. ఈ సమస్యలను ఉపయోగించుకొని రిమోట్ ఎటాకర్లు ఎవరైనా కంప్యూటర్ లోకి చొరబడి తమకు ఇష్టమైన ఏ పని అయినా చేయగలరు. అంతేకాకుండా కంప్యూటర్ ఆకస్మాత్తుగా ఆగిపోయేలా చేయగలరు' అని ఈ సెక్యూరిటీ వార్నింగ్ లో cert -in పేర్కొంది. గూగుల్ క్రోమ్ లో ఉన్న మల్టీపుల్ వల్నరబిలిటీస్ లో ఒకటి v8 లో టైప్ కన్ఫ్యూజన్, మరొకటి యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ డాన్. అలానే గ్రాఫిక్స్ రెండరింగ్ ఇంజన్ స్కియాలో ఇంటిజర్ ఓవర్ ఫ్లో కూడా ఉంది. చివరగా v8 ఇంజన్ లో కొన్ని భాగాలు సరిగా రన్ కాకపోవడం వల్ల సమస్య వస్తోంది. హెకర్లు కంప్యూటర్లోని సెక్యూరిటీని దాటి వెళ్లి ఈ సమస్యలను ఉపయోగించుకుంటే అంతకు మించిన ప్రమాదం మరొకటి ఉండదు. ఈ సమస్యను ఉపయోగించుకుంటూ యూజర్లను మోసం చేసి వారికి తెలియకుండానే వారిని ఒక ఫేక్ వెబ్సైట్ కు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. హానికరమైన వెబ్ సైట్ ద్వారా కంప్యూటర్ లోకి వైరస్ లు ప్రవేశించే అవకాశం ఉంది. వైరస్ లు  కారణంగా కంప్యూటర్లు పాడవడంతోపాటు బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ వంటి ముఖ్యమైన సమాచారం కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రమాదం ఎక్కువగా విండోస్ మాక్స్ లేదా లైనక్స్ కంప్యూటర్ లో ఓల్డ్ గూగుల్ క్రోమ్ వెర్షన్ వాడుతున్న వారికి రిస్క్ ఉంటుంది. విండోస్ లేదా మ్యాక్ కంప్యూటర్ యూజర్లు విషయానికి వస్తే వీరు 129.0.6668.70 లేదా 129.0.6668.71 కంటే ముందు క్రోమ్ వెర్షన్లను ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటిలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అధికంగా ఉంటాయి. వీటిని వాడుతున్నట్లయితే వెంటనే లేటెస్ట్ వెర్షన్ కు అప్డేట్ చేసుకోవాలి. లైనక్స్ కంప్యూటర్ల యూజర్లు 129.0.6668.70 కంటే ముందు వెర్షన్లను ఉపయోగించకూడదు. ఇటువంటి సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకునేందుకు తగిన జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కంప్యూటర్ యూజర్లు గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ కు అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొత్త వెర్షన్లలో కొత్త ఫీచర్లు ఉండడమే కాకుండా ఓల్డ్ వెర్షన్లలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయనున్నారు. ఇటువంటి వారంతా గూగుల్ క్రోమ్ ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేసి త్రీ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇది క్రోమ్ విండో టాప్ రైట్ కార్నర్ లో ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్ పై నొక్కి అబౌట్ క్రోమ్ సెలెక్ట్ చేయాలి. కొత్త వెర్షన్ కనిపిస్తే అప్డేట్ బటన్ పై క్లిక్ చేయాలి. కొన్నిసార్లు క్రోమ్ ఆటోమేటిగ్గా అప్డేట్ అవుతుంది. లేకపోతే మాన్యువల్ గా అప్డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ అయిన తర్వాత క్రోమ్ ను రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. రీస్టార్ట్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా క్రోమ్ ను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్