ఏపీలో నెంబర్‌ ప్లేట్ల యుద్ధం.. వైసీపీ వర్సెస్‌ టీడీపీ - జనసేన

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మరికొద్దిరోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారన్న దానిపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటే..? తమ పార్టీయే అధికారంలోకి వస్తుందంటూ వైసీపీ, కూటమి అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా వాదోపవాదనలకు దిగుతున్నారు.

number plates battle

 నెంబర్‌ ప్లేట్ల యుద్ధం



రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మరికొద్దిరోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారన్న దానిపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటే..? తమ పార్టీయే అధికారంలోకి వస్తుందంటూ వైసీపీ, కూటమి అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా వాదోపవాదనలకు దిగుతున్నారు. సామాజిక మాధ్యమాలు వేదికగా సాగుతున్న ఈ వార్‌.. ఇప్పుడు నెంబర్ల పేట్ల దిశగా పయనం మార్చుకుంది. అభిమాన పార్టీ, నాయకులకు సంబంధించిన పేర్లు, ఫొటోలను, ఆయా పార్టీల కలర్స్‌ మాత్రమే ఇప్పటి వరకు బైక్‌లు, కార్లపై వేయించుకోవడం చూశాం. కానీ, తొలిసారి నెంబర్ల ప్లేట్లపై సరికొత్త యుద్ధానికి వైసీపీ, టీడీపీ, జనసేన అభిమానులు దిగుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నెంబర్‌ ప్లేట్లను కొట్టిస్తున్నారు. అంతటితో ఆగకుండా వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఇటువంటివి పెద్ద సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, నవ్యాంధ్ర ప్రదేశ్‌ సీఎం గారి తాలూకా అంటూ చంద్రబాబు ఫొటో, రెండోసారి ఏపీ సీఎం జగన్‌ గారి తాలూకా అంటూ పెద్ద ఎత్తున నెంబర్‌ ప్లేట్లను డిజైన్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా పోస్టింగ్‌లు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్నాయి. మొదట పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా నెంబర్‌ ప్లేట్లు విడుదల కాగా, ఆ తరువాత సీఎం జగన్‌, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లుతోనూ పోస్టులు కనిపిస్తున్నాయి. అనేక చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు పేర్లుతో బండ్లపై నెంబర్‌ ప్లేట్లను డిజైన్‌ చేసి మరీ పెట్టుకుంటున్నారు. ఇదే ప్రస్తుతం ఏపీలో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున నడుస్తోన్న వ్యవహారంగా కనిపిస్తోంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్