రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల బంద్

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేయడానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సమ్మె నోటీసులు అందించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షాకు రాసిన లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని అసోసియేషన్ ప్రస్తావించింది.

ఆరోగ్య శ్రీ
ఆరోగ్య శ్రీ




ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేయడానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సమ్మె నోటీసులు అందించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షాకు రాసిన లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని అసోసియేషన్ ప్రస్తావించింది. ఈ నెల 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టు నుంచి ఉన్న 1500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసిన అసోసియేషన్.. సుదీర్ఘకాలం పాటు బిల్లులు పెండింగ్ లో ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. పలుమార్లు లేఖలు రాసిన ఇప్పటి వరకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లింపు చేశారని, కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ తో ఆస్పత్రుల నిర్వహణ ఇబ్బందిగా మారుతోందని అసోసియేషన్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న బకాయిలు మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. పెండింగ్ బకాయిలు విడుదల చేసేంత వరకు సేవలను అందించబోమని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రి అసోసియేషన్ సమ్మె నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలోనూ రెండు సార్లు సమ్మె నోటీసులు ఇవ్వగా ప్రభుత్వం స్పందించి కొంత మొత్తం చొప్పున విడుదల చేయడంతో ఆసుపత్రి అసోసియేషన్ సమయం నుంచి వెనక్కి తగ్గాయి. కానీ ఈసారి పూర్తిస్థాయి బకాయిలను విడుదల చేస్తేగాని సేవలు అందించబోమని స్పష్టం చేయడంతో.. రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్