Social Media Ban | పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్

చిన్నారులు వినియోగించే సామాజిక మాధ్యమాల సైట్లపై నియంత్రణకు అనేక దేశాలు ఆలోచన చేస్తున్నాయి. ఆ దిశగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో 16 ఏళ్లలోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభ ఆమోదం అనంతరం సెనెట్ కు పంపించింది. ప్రతినిధుల సభలో అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 102 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 13 ఓట్లు పడ్డాయి.

social media sites

సామాజిక మాధ్యమాలు

గడిచిన కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు వినియోగించే చిన్నారులు అధికమయ్యారు. అయితే, సోషల్ మీడియా వినియోగం రోజురోజుకు శృతిమించడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఇటువంటి ప్లాట్ఫామ్స్ కు అలవాటు పడుతున్న వారు వాటికి బానిసలుగా మారుతున్నారు. గంటలు తరబడి సమయాన్ని వెచ్చిస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. కొందరైతే రోజులో మూడు వంతులు సమయాన్ని ఇటువంటి వాటిలో గడిపేందుకే కేటాయిస్తున్నారు. ఈ తరహా అలవాట్లతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనేక దేశాల్లోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు సెల్ఫోన్ చూస్తే గాని అన్నం తినని పరిస్థితికి చేరుకుంటున్నారు. ఇక స్కూల్, కాలేజీలకు వెళ్లే పిల్లలు అయితే సామాజిక మాధ్యమాల్లో ఎకౌంట్లు ఏర్పాటు చేసుకుని అందులోనే సమయాన్ని వెల్లదీస్తున్నారు.

ఈ సామాజిక మాధ్యమాల వల్ల కొంతమంది పిల్లలు తప్పుదారి పడుతున్న పరిస్థితి అనేక దేశాల్లో ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు చిన్నారులు వినియోగించే సామాజిక మాధ్యమాల సైట్లపై నియంత్రణకు ఆలోచన చేస్తున్నాయి. ఆ దిశగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో 16 ఏళ్లలోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభ ఆమోదం అనంతరం సెనెట్ కు పంపించింది. ప్రతినిధుల సభలో అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 102 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 13 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు ఆమోదాన్ని తెలియజేయడంతో తదుపరి ప్రక్రియ కోసం సెనెట్ కు పంపించారు. ఈ బిల్లు సెనేట్ లో పాస్ అయితే అమలులోకి వస్తుంది. ఈ బిల్లు ఒకసారి అమలులోకి వస్తే ఆస్ట్రేలియాలో టిక్ టాక్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్లు 16 ఏళ్లలో ఒక పిల్లల రిజిస్ట్రేషన్ లను అడ్డుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాజమాన్యాలు వ్యవహరించకపోతే 50 మిలియన్ డాలర్ల జరిమానా విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. ఆ దేశ ప్రజలు కూడా తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దేశంలో సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడం, దీనివల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటుండడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నట్లు అనేకమంది తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకే అక్కడ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దేశంలో ఈ చట్టం అమలైన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి అనేక దేశాలు కూడా ఇదే తరహా చట్టాలను తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం రీత్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయానికి తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని ప్రధాని ఆల్బనీస్ పేర్కొన్నారు. వయసు ధ్రువీకరణ బాధ్యత సంబంధిత వేదికలు చూడాల్సి ఉంటుందని ఈ బిల్లు సందర్భంగా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ నూతన నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. అయితే యూట్యూబ్ కు మాత్రం ఇందులో నుంచి మినహాయింపును ఇచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్