విద్యుత్ చార్జీలను పెంచాలని భావించిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పట్లో విద్యుత్ చార్జీలను పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్థిర చార్జీలను పది రూపాయల నుంచి రూ.50 రూపాయలు పెంచాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునుకు బ్రేక్ పడినట్టు అయింది. డిస్కమ్ల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిపిన ఈఆర్సి వాటిని తిరస్కరించింది.
తెలంగాణలో డిస్కమ్
విద్యుత్ చార్జీలను పెంచాలని భావించిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పట్లో విద్యుత్ చార్జీలను పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్థిర చార్జీలను పది రూపాయల నుంచి రూ.50 రూపాయలు పెంచాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునుకు బ్రేక్ పడినట్టు అయింది. డిస్కమ్ల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిపిన ఈఆర్సి వాటిని తిరస్కరించింది. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించినట్టు అయింది. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీని దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరీలో కూడా పెంచలేదని స్పష్టం చేసింది. స్థిర చార్జీలు కూడా ఎప్పటికీ ఉన్నవే కొనసాగుతాయని వెల్లడించింది. పౌల్ట్రీ ఫార్మ్, గోట్ ఫామ్లను కమిషన్ ఆమోదించలేదు. హెచ్టీ కేటగిరీలో ప్రతిపాదనలు రిజెక్ట్ చేసింది. రూ.1800 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కమ్ల ప్రతిపాదనలను ఈఆర్సి తిరస్కరించింది. 3 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించిన వారిపై ఫిక్సడ్ చార్జీలను రూ.50 రూపాయలకు పెంచాలని ప్రతిపాదించినప్పటికీ తిరస్కరించంది.
విద్యుత్ వినియోగం 800 యూనిట్లు దాటితే ఫిక్సడ్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంలు ప్రతిపాదనను ఈఆర్సి ఆమోదించింది. మరికొన్ని కేటగిరీల్లో 0.47 శాతం టారిఫ్ రేట్లు పెరిగాయి. గృహ వినియోగదారులకు మినిమం చార్జీలు తొలగించింది ఈఆర్సి. గ్రిడ్ సపోర్ట్ చార్జీలను కమిషన్ ఆమోదించింది. 132 కెవిఎ, 133 కెవిఎ, 11 కెవిలలో గతంలో మాదిరిగానే చార్జీలు ఇకపై ఉండనున్నాయి. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్ లో ఎలాంటి మార్పు లేదు. చేనేత కార్మికులకు హార్స్ పవర్ ను పెంచుతూ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో విద్యుత్ చార్జీల మాత తాత్కాలికంగా ఆగిందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలు ఈ ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల వరకే ఉంటాయని చెబుతున్నారు.