మీడియా ప్రతినిధులపై దాడి.. మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు

మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బౌన్సర్లతోపాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్ లను డిపాజిట్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా గురువారం ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు పోలీస్ శాఖ సూచించింది.

Father son conflict

తండ్రి కొడుకుల గలాట

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటికి మంగళవారం రాత్రి పలువురు మీడియా ప్రతినిధులు వెళ్లారు. హైదరాబాద్ జలపల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై అక్కడున్న మోహన్ బాబు బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. మోహన్ బాబు కూడా మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక మీడియా ప్రతినిధికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటన తర్వాత అక్కడే మీడియా ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. మీడియాపై దాడి హేయయమైన చర్య అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బౌన్సర్లతోపాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్ లను డిపాజిట్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  అంతేకాకుండా గురువారం ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు పోలీస్ శాఖ సూచించింది. గడిచిన కొద్దిరోజులుగా మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి.

మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ కు, కుటుంబ సభ్యులకు మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆస్తులు పంపకాలకు సంబంధించిన గొడవలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే ఇంటికి వెళ్లిన మనోజ్.. తండ్రితో గొడవ పడినట్లు చెబుతున్నారు. ఈ గొడవలో మనోజ్ ను మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది కొట్టారని మనోజ్ ఫిర్యాదు చేయగా, తనపై దాడికి పాల్పడ్డాడు అంటూ మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం పోలీస్ అధికారులు కలిసి మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసం నుంచి బయటికి వెళ్లిపోయారు. అనంతరం డిజిపి ఆఫీసులో అడిషనల్ డీజీపీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళ్తే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు. చాలాసేపు గేటు బయటే కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు గేటు ఓపెన్ చేయకపోవడంతో కారు దిగి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ 7 నెలల పాప లోపల ఉందని మౌనిక ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో మంచు మనోజ్ తన బౌన్సర్లతో గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారు. పూర్తిగా మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు సమక్షంలోనే బౌన్సర్లు అదే సమయంలో దాడికి ప్రయత్నించారు. మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్వేక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలు కూడా అవడంతో ఈ ఘటనను మీడియా సంఘాల నాయకులు సీరియస్ గానే తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా పోలీస్ శాఖ స్పందించింది. బౌన్సర్లను బైండోవర్ చేయాలంటూ ఆదేశించడంతో పాటు మోహన్ బాబును విచారణ కూడా హాజరు కావాలని ఆదేశించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్