గంజాయి, డ్రగ్స్ తోనే ఆడపిల్లలపై అఘాయిత్యాలు : సీఎం చంద్రబాబు నాయుడు

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన ఆడపిల్లల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వల్ల ఈ తరహా అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరుడుగట్టిన నేరస్థులకు ఏపీలో స్థానం లేదని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడే వారి తాటతీస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

CM Nara Chandrababu Naidu

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన ఆడపిల్లల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వల్ల ఈ తరహా అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరుడుగట్టిన నేరస్థులకు ఏపీలో స్థానం లేదని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడే వారి తాటతీస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామని, బెల్ట్ షాపులు లేకుండా  ఎమ్మెల్యేలు చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నినాదం సంక్షేమం, అభివృద్ధి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేలా తమ పాలన సాగుతుందని వెల్లడించారు. పేద ప్రజల ఆదాయం పెరిగి, ఖర్చులు తగ్గాలని, వారి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమ పథకాలు అమలు ప్రారంభమైందని, దానిని ఓటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆడబిడ్డలు కష్టాలు పడకూడదన్న ఉద్దేశంతోనే దీపం పథకాన్ని ప్రారంభించామని, అదే ఉద్దేశాన్ని కొనసాగించేందుకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, వాటిని ప్రతి లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కొందరు తెలియని వాళ్ళు ఎక్కడ ఇచ్చారని మాట్లాడుతున్నారని, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే లబ్ధిదారులకు వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 42 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించామని స్పష్టం చేశారు.

ఈ పథకం అమలుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని చెప్పామని, ఈ రెండు ఉంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్ పథకాన్ని పొందవచ్చు అన్నారు. ఎవరైనా ఈ అర్హతలు కలిగి సిలిండర్ ఇవ్వకపోతే దబాయించి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆర్డర్ బుక్ చేసుకున్న 48 గంటల్లో డబ్బులు వేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెత్త పన్ను రద్దు చేశామన్నారు. 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, ఆ చెత్తను వదిలించే బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించామన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిగా చెత్తను క్లీన్ చేసే బాధ్యతను తీసుకుంటున్నామన్నారు. వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. 25 నూతన పాలసీలను తీసుకువచ్చామని, ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. తొలిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ ఇచ్చామన్నారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని, లక్షలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల లభిస్తాయి అన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్