ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం.. అమ్మాయిలు బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు

ఏపీలో వరుసగా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట చిన్నారులపై అత్యాచారం చేయగా, ఆ తరువాత వివాహితపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన వెలుగులకు వచ్చింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న మరోబారం కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు పెట్టి ఆ వీడియోలు కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దుర్గటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీన్ని బిజినెస్ మోడల్ గా చేసుకొని అబ్బాయిలు తమకు నచ్చిన వ్యక్తుల వీడియోలను తెప్పించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పలువురు పేర్కొంటున్నారు.

students worry in college campus

కాలేజీ ఆవరణలో విద్యార్థుల ఆందోళన

ఏపీలో వరుసగా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట చిన్నారులపై అత్యాచారం చేయగా, ఆ తరువాత వివాహితపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన వెలుగులకు వచ్చింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న మరోఘోరం కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు పెట్టి ఆ వీడియోలు కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దుర్గటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీన్ని బిజినెస్ మోడల్ గా చేసుకొని అబ్బాయిలు తమకు నచ్చిన వ్యక్తుల వీడియోలను తెప్పించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పలువురు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ లో ఒక కెమెరా ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు. దీనిపై హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలుగులోకి వచ్చింది. ఈ కెమెరాలను ఏర్పాటు చేసింది ఒక అమ్మాయిగా గుర్తించారు.

అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ఈ దారుణానికి పాల్పడింది. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు. ఇలా తీసిన వీడియోలను కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్టుగా కూడా కాలేజీ వర్గాలు, విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు గురువారం అర్ధరాత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ, హాస్టల్ యాజమాన్యంపై మండిపడ్డారు. ఈ పని చేసినట్లు భావిస్తున్న విద్యార్థులపై ఈ సందర్భంగా సహచరు విద్యార్థులు దాడికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఎంతమంది అమ్మాయిల వీడియోలు తీశారు. దీనికి కారణం ప్రేమా వ్యవహారమా..? లేక మరేదైనా ఉందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా విచారణ జరపాలని ఆదేశించారు. ఈ తరహా ఘటనలు కొనరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్