పిఎఫ్ సొమ్ము విత్ డ్రా ఇక క్షణాల్లో.. అందుబాటులోకి రానున్న ఏటీఎం

ఏటీఎం మాదిరిగా డబ్బులు తీసుకునేలా పిఎఫ్ డబ్బులను తీసుకునేందుకు అనుగుణంగా ప్రత్యేక ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రతి ఉద్యోగి తమ పిఎఫ్ ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా తాజాగా వెల్లడించారు. 2025 జనవరి నుంచి ఈ సేవలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఉద్యోగ భవిష్య నిధి) సొమ్మును అవసరానికి తీసుకోవాలంటే ప్రస్తుతం ఉద్యోగులు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆన్లైన్లో విత్ డ్రా పెట్టుకున్న కనీసం వారం నుంచి పది రోజుల తర్వాత మాత్రమే డబ్బులు చేతికి వస్తాయి. అప్పటివరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉద్యోగులకు ఏర్పడుతోంది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఉద్యోగులు అప్పులు చేసుకుని ఆ తర్వాత ఈపీఎఫ్ డబ్బులు వచ్చిన తర్వాత ఆ అప్పులు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇటువంటి ఇబ్బందులకు పరిష్కారాన్ని చూపించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై ఏటీఎం మాదిరిగా డబ్బులు తీసుకునేలా పిఎఫ్ డబ్బులను తీసుకునేందుకు అనుగుణంగా ప్రత్యేక ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రతి ఉద్యోగి తమ పిఎఫ్ ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా తాజాగా వెల్లడించారు. 2025 జనవరి నుంచి ఈ సేవలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకుగాను ఐటీ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్లు, క్లైములు పరిష్కారం వేగవంతంగా జరిగేలా కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పిఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక కార్డును జారీ చేయనుంది. ఈ కార్డును వినియోగించి ఏటీఎం ద్వారా ఎక్కడైనా డబ్బులు తీసుకునే వెసులుబాటును కల్పించనుంది. అయితే పిఎఫ్ తీసుకునేందుకు అవసరమైన ప్రత్యేక ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏటీఎంలను కొత్త ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈపీఎఫ్ వోలో ప్రస్తుతం ఏడు కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాదిమంది వినియోగదారులకు లబ్ధి చేకూరాలని. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు క్షణాల్లోనే పరిష్కారాన్ని చూపించేలా తాజా ఏటీఎం సేవలు ఉపకరిస్తాయని చెబుతున్నారు. 

పీఎఫ్ సొమ్ము విత్ డ్రా చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను ఎంతోమంది వినియోగదారులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. మెరుగైన సేవలను అందించే కార్యక్రమంలో భాగంగా అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం.. ఈ క్రమంలోనే ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త ఏడాదిలో అందుబాటులోకి ఈ ఏటీఎంలు రానున్నాయి. అయితే వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. పైలెట్ ప్రాజెక్టుగా మొదట కొన్ని చోట్ల అమలు చేయాలని కేంద్ర భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఏటీఎంలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మిక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టు అమలు చేయాల్సిన అవసరం ఉండదని, ఏటీఎంలను నేరుగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కొన్నిచోట్ల ఏర్పాటు చేస్తుందో.? లేక దేశ వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తుందో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్