Vijayawada | కనకదుర్గమ్మకు తొలిసారి ఆషాఢ సారె మహోత్సవాలు.. ఈ నెల 6 నుంచి నెల రోజుల పాటు..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా ఈ నెల ఆరో తేదీ నుంచి సారె మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో రామారావు వెల్లడించారు.

Indrakiladri Temple

ఇంద్రకీలాద్రి ఆలయం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా ఈ నెల ఆరో తేదీ నుంచి సారె మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో రామారావు వెల్లడించారు. ఆషాడ మాస సారె ఉత్సవాల్లో భక్తులు సారె సమర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన వివరించారు. ఈ నెల ఆరో తేదీ నుంచి నెల రోజులపాటు సారె మహోత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. అలాగే, ఈనెల 19 నుంచి ఇంద్రకీలాద్రిపై మూడు రోజులపాటు శాకాంబరి దేవీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. 

ఈసారి తొలిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో వెల్లడించారు. జూలై ఆరో తేదీ నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు, జూలై 14 న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాల సమర్పణ ఉంటుందని అధికారులు తెలిపారు. మహా నివేదన సమయంలో ప్రోటోకాల్‌ దర్శనాలను ఉదయం 11.30 గంటలు నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిలిపివేయనున్నారు. జూలై 26న ఇంద్రకీలాద్రి నుంచి భాగ్యనగరం మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలకు పట్టువస్ర్తాల సమర్పణ ఉంటుంది. మల్లేశ్వర స్వామికి బంగారు తాపడం చేసిన కవచం, నాగాభరణం, మకరతోరణం, పీఠం దాతలు అందించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్