ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీకొట్టిన ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆదేశించారు. వరద తీవ్రత అధికంగా ఉన్న సమయంలో నాలుగు పడవలు ప్రకాశం బ్యారేజీని గేట్లు వైపుగా వచ్చి ఢీ కొట్టాయి. ఈ వ్యవహారంలో స్వల్పంగా కొన్ని గేట్లకు డ్యామేజీ జరిగింది. దీనిపై అప్పట్లోనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్లు
ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీకొట్టిన ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆదేశించారు. వరద తీవ్రత అధికంగా ఉన్న సమయంలో నాలుగు పడవలు ప్రకాశం బ్యారేజీని గేట్లు వైపుగా వచ్చి ఢీ కొట్టాయి. ఈ వ్యవహారంలో స్వల్పంగా కొన్ని గేట్లకు డ్యామేజీ జరిగింది. దీనిపై అప్పట్లోనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ బోట్లు వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఆదేశాలతోనే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ సాగించారు. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కొట్టుకువచ్చిన వాటిలో మూడు పడవలు కుక్కలగడ్డ ఉష్ణాద్రికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఉషాద్రితోపాటు సూరాయపాలెం వాసి కోమటిరెడ్డి రామోహన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విజయవాడ కోర్టుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఏమి తేలుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఈ నెల ఒకటో తేదీన ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను నాలుగు పడవలు ఢీకొట్టాయి. నాలుగు పడవలు ఢీ కొట్టడంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్ల వద్ద సుమారు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. కొట్టుకువచ్చిన బోట్ల కోసం ఇప్పటి వరకు వాటి యజమానులు ఎవరూ రాలేదరు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఘటనపై విచారణ జరపాలని ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పడవలు కొట్టుకురావడంలో యజమానుల నిర్లక్ష్యం ఉందని గుర్తించిన పోలీసులు.. వాటిని దిగువకు వదలడంలో ఏమైనా కుట్రకోణం ఉందా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మూడు పడవలపై వైసీపీకి చెందిన రంగులు ఉండడంతో ఆ పార్టీ నేతల ప్రమేయం ఉందా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు రిమాండ్ విధించిన తరువాత కుట్రకోణంపై సమగ్ర దర్యాప్తును పోలీసులు చేయనున్నారు.