తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు జోరుగా ఏర్పాట్లు సాగిస్తున్నారు. తిరుమలలో అక్టోబర్ నాలుగో తేదీ నుంచి 12 వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఏటా మాదిరిగానే వార్షిక బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లను సాగిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు అందించారు.
బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు జోరుగా ఏర్పాట్లు సాగిస్తున్నారు. తిరుమలలో అక్టోబర్ నాలుగో తేదీ నుంచి 12 వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఏటా మాదిరిగానే వార్షిక బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లను సాగిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు అందించారు. ఈవో సూచన మేరకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలు నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఏడాది కూడా భారీగానే భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రసాద వితరణ, మంచినీటి ఏర్పాట్లపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ నాలుగో తేదీన ధ్వజారోహణం, 8వ తేదీన గరుడసేవ, 9వ తేదీన స్వర్ణ రథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు వాహన సేవలు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం ఏడు గంటలకు ఉంటాయని వివరించారు. గరుడ సేవ రోజున అక్టోబర్ ఏడో తేదీన రాత్రి 11 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై కొండపైన నిషేధం ఉంటుందని టిటిడి అధికారులు వెల్లడించారు బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్థిక సేవలు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాలని అధికారులు వివరించారు. ఈ విషయం తెలియక అనేక ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక దర్శనాలకు వచ్చి ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలను గుర్తించుకొని ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన ఏర్పాటును చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.