ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడంతో సేవలు నిలిపేయాలని నిర్ణయించిన కార్పొరేట్ ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి. నిధులు విడుదలకు ప్రభుత్వం అంగీకరించడంతో యధావిధిగా సేవలు అందించాలని ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన బిల్లులు భారీగా పెండింగ్లో ఉండడంతో అనేక ఆసుపత్రిలో సేవలను నిలిపివేశాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1130 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
ప్రతికాత్మక చిత్రం
ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడంతో సేవలు నిలిపేయాలని నిర్ణయించిన కార్పొరేట్ ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి. నిధులు విడుదలకు ప్రభుత్వం అంగీకరించడంతో యధావిధిగా సేవలు అందించాలని ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన బిల్లులు భారీగా పెండింగ్లో ఉండడంతో అనేక ఆసుపత్రిలో సేవలను నిలిపివేశాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1130 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిధులు చెల్లింపుపై స్పందించింది. రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని, ఆరోగ్యశ్రీ సేవలను యధావిధిగా కొనసాగిస్తామని హాస్పిటల్ అసోసియేషన్ ఒక లేఖలో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు యధావిధిగా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు.
దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే భారీగా నిధులను విడుదల చేసింది. నిధులు విడుదల కావడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ కూడా వెంటనే స్పందించింది. రోగులుకు ఇబ్బందులు కలుగుకుండా యధావిధిగా వైద్య సేవలను అందిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేయడం పట్ల అసోసియేషన్ హర్షాన్ని కూడా వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఈ స్థాయిలో నిధులు మంజూరు చేయడం ఇదే తొలిసారి అని పలువురు పేర్కొంటున్నారు. 2015లో రూ.444 కోట్లు, 2016లో రూ.609 కోట్లు, 2017లో రూ.524 కోట్లు, 2018లో రూ.596 కోట్లు, 2019లో రూ.681 కోట్లు, 2020 రూ.257 కోట్లు, 2021లో రూ.783 కోట్లు, 2022లో రూ.631 కోట్లు, 2023లో రూ.515 కోట్లు రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024లో రూ.1130 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ విషయాన్ని ఆరోగ్య సీఈవోతో జరిగిన చర్చలు అనంతరం కూడా వైద్య సేవలు నెట్వర్క్ హాస్పిటల్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కావాలనే కొంతమంది రాజకీయ నాయకులు ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగిస్తున్నారని ఆరోగ్య శాఖ భావిస్తుంది. ఈ ఈ మధ్యకాలంలో విడుదల చేసిన నిధుల్లో రూ.1130 కోట్ల ఇదే అత్యధికమని పేర్కొంటున్నారు.