ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. అనేకచోట్ల వైఫై సేవలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, షాపింగ్ కాంప్లెక్స్ లో వైఫై సేవలు అందుబాటులో ఉండడంతో ఎంతోమంది వినియోగదారులు వాటి సేవలను పొందుతున్నారు. అయితే ఉచితంగా వచ్చే వైఫై సేవలు వద్దంటూ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. విమానాశ్రయాలు, కాఫీ షాప్ లు మదన పబ్లిక్ ప్రదేశాల్లో ఇచ్చే ఫ్రీ వైఫై సదుపాయం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి వైఫై సేవలను కనెక్ట్ చేసుకోవడం భద్రత కాదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. స్కామర్లు, హ్యాకర్లు అమాయక ప్రజలను ట్రాప్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ఉచ్చుగా వీటిని చెబుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. అనేకచోట్ల వైఫై సేవలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, షాపింగ్ కాంప్లెక్స్ లో వైఫై సేవలు అందుబాటులో ఉండడంతో ఎంతోమంది వినియోగదారులు వాటి సేవలను పొందుతున్నారు. అయితే ఉచితంగా వచ్చే వైఫై సేవలు వద్దంటూ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. విమానాశ్రయాలు, కాఫీ షాప్ లు మదన పబ్లిక్ ప్రదేశాల్లో ఇచ్చే ఫ్రీ వైఫై సదుపాయం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి వైఫై సేవలను కనెక్ట్ చేసుకోవడం భద్రత కాదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. స్కామర్లు, హ్యాకర్లు అమాయక ప్రజలను ట్రాప్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ఉచ్చుగా వీటిని చెబుతున్నారు. ఫ్రీ వైఫై ఉపయోగించుకోవడం వల్ల ప్రైవేట్ డేటా, ఆర్థిక సమాచారానికి సంబంధించిన విషయాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి మోసాలను అరికట్టడానికి డిజిటల్ భద్రత అవగాహనను మరింత పెంచడానికి CERT - In తన జాగ్రూక్త దివాస్ చొరవ కింద పబ్లిక్ వైఫై నెట్వర్కుల ద్వారా లావాదేవీలు చేయకుండా పౌరులను హెచ్చరించింది.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. మోసాలు కూడా ఎక్కువైపోతున్న నేపథ్యంలో పబ్లిక్ వైఫై సేవలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని పేర్కొంది. కాబట్టి ఏదైనా తెలియని లైక్స్ మీద లేదా అటాచ్మెంట్ మీద ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని స్పష్టం చేసింది. ఏవైనా ఖాతాలకు స్ట్రాంగ్ పాస్వర్డ్లను ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని CERT - In పేర్కొంది. గడచిన కొన్నానుగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా వైఫై సేవలకు దూరంగా ఉండడం అత్యంత కీలకమని నిపుణులు కూడా సూచిస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వైఫై సేవలు ద్వారా స్కామర్లు కొన్ని రకాల స్కామ్లకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పాస్వర్డ్ ఎంటర్ చేసే క్రమంలో ఫోన్లకు సంబంధించిన అత్యంత విలువైన సమాచారం తస్కరించే ప్రమాదం ఉంది. దీనివల్ల సైబర్ నేరాలకు ఆస్కారం ఏర్పడుతుందని చెబుతున్నారు. కాబట్టి వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ షాపింగ్ మాల్స్, కాఫీ షాపుల్లో ఇచ్చే వైఫై పాస్వర్డ్ వల్ల కొన్ని రకాల స్కామ్ లకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.