వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నారా.? 10 లక్షల వరకు రుణం పొందండిలా.!

చిరు వ్యాపారులను, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా అర్హత ఉన్న వ్యక్తులకి ఎటువంటి పూచీకత్తు లేకుండా 10 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఇతర ఆర్థిక మధ్య వర్తుల ద్వారా రుణాలను మంజూరు చేయనున్నారు.

Mudra is a business started with a loan

ముద్రా రుణంతో ప్రారంభించిన వ్యాపారం

యువత చిరు వ్యాపారాలు చేసే ఆలోచనలో ఉంటున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తే వ్యాపారాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న యువత సంఖ్య తక్కువేమీ కాదు. యువత ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఆయా పథకాలు పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలు చేయాలనుకునే యువతకు 10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించే ఒక స్కీమ్ ను అమలు చేస్తుంది. ఈ స్కీమ్ గురించి చాలామంది యువతకు అవగాహన లేకపోవడంతో ఆశించిన స్థాయిలో రుణాలు అందించలేకపోతున్నాయి బ్యాంకులు. చిరు వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. 

చిరు వ్యాపారులను, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా అర్హత ఉన్న వ్యక్తులకి ఎటువంటి పూచీకత్తు లేకుండా 10 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఇతర ఆర్థిక మధ్య వర్తుల ద్వారా రుణాలను మంజూరు చేయనున్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఉద్దేశంతో 2017 ఏప్రిల్ 8న ప్రధాన నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కార్పొరేట్, వ్యవసాయతర ప్రయోజనాల కోసం రుణాలను అందిస్తారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువకులు, తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో సహకారాన్ని అందిస్తుంది. ఈ రుణాలతో మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీస్ సెక్టార్ లోని చిన్న వ్యాపారాలకు, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం మొదలైన వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు రుణాలు తీసుకోవచ్చు.

ముద్ర లోన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ముందుగా జన్ సమర్థ పోర్టల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో స్కీమ్స్ డ్రాప్ డౌన్ మెనూలో బిజినెస్ యాక్టివిటీ లోన్ ను ఎంచుకొని ప్రధాన మంత్రి ముద్ర యోజన ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని కిందికి స్క్రోల్ చేసి చెక్ ఎలిజిబిలిటీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేనేత, మాన్యువల్ స్కావెంజర్ లేదా వీధి వ్యాపారులు అయితే అధర్ బిజినెస్ లో ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాపారం కొత్త లేదా పాతది అయితే వ్యాపార రకం, స్థానం, వెంచర్ అంచనా వ్యయం, సొంత ఫండ్స్ ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనే దాని గురించి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఎంత రుణానికి అర్హులో పోర్టల్ లెక్కిస్తుంది. ఉదాహరణకు ప్రాజెక్టు ధర రెండు లక్షలు అయితే మీరు రూ.50,000 పెట్టుబడిగా పెట్టగలిగితే, లోన్ మొత్తం రూ1.5 లక్షలు అవుతుంది. మంత్లీ ఈఎంఐ, లోన్ కాల వ్యవధి గురించి వివరాలు పొందడానికి కాలిక్యులేట్ ఎలిజిబిలిటీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ తో లాగిన్ చేసి ప్రైవసీ పాలసీ టర్మ్ అండ్ కండిషన్స్ అంగీకరించి ముద్రా స్కీమ్ అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. పోర్టల్ అవసరమైన డాక్యుమెంట్ల లిస్టును చూపిస్తుంది. వాటిని అగ్రి చేసి సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ కోసం పాన్, ఆధార్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. నెలవారి సేల్స్ వ్యాపార వివరాలను అందించాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లు, అకౌంట్ వెరిఫై చేయడం ద్వారా బ్యాంక్ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు చిరునామా, ఇప్పటికే ఉన్న రుణాల గురించి వివరాలను యాడ్ చేయాలి. ఫామ్ పూర్తయిన తర్వాత పోర్టల్ వివిధ బ్యాంకులు వాటి వడ్డీ రేట్లు, లోన్ టెన్యూర్, లోన్ ఆఫర్లు అందిస్తుంది. అవసరాలకు సరిపడే బెస్ట్ లోన్ ఆఫర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. లోన్ అప్రూవ్ అయిన తర్వాత లోన్ అమౌంట్ వెల్లడించడానికి ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం బ్యాంక్ బ్రాంచ్ ను విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు లేకుండా అందిస్తున్న రుణాలను పొందవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్