ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంటర్నెట్ వినియోగిస్తూనే ఉంటున్నారు. నిత్యం గూగుల్ లో ఏదో ఒక విషయంపై సెర్చ్ వారి సంఖ్య పెరిగింది. గూగుల్ సెర్చ్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కదా అని ఇష్టం వచ్చిన సైట్లను వెతికితే కొన్నిసార్లు జైలు జీవితం కూడా అనుభవించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతికాత్మక చిత్రం
ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంటర్నెట్ వినియోగిస్తూనే ఉంటున్నారు. నిత్యం గూగుల్ లో ఏదో ఒక విషయంపై సెర్చ్ వారి సంఖ్య పెరిగింది. గూగుల్ సెర్చ్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కదా అని ఇష్టం వచ్చిన సైట్లను వెతికితే కొన్నిసార్లు జైలు జీవితం కూడా అనుభవించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్లో అసలు వెతకకూడని వాటిపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్నెట్లో చాలామంది వ్యక్తులు ఉచితంగా సినిమాలు లేదా వెబ్ సిరీస్ లో చూసేందుకు గూగుల్లో వెతుకుతుంటారు. కొత్త సినిమాలను పైరసీ చేసిన లేదా గూగుల్ లో సెర్చ్ చేసిన అది నేరం కిందకు వస్తుంది. దీనివల్ల కనీసం మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇది కాకుండా పది లక్షల వరకు జరిమానా విధిస్తారు.
చైల్డ్ పోర్న్ గూగుల్ లో సెర్చ్ చేస్తే అది కూడా నేరం కిందకి వస్తుంది. దీనికి సంబంధించి భారత దేశంలో చట్టం కఠినంగా ఉండే. ఫోక్ షో చట్టం 2012లోని సెక్షన్ 14 ప్రకారం చైల్డ్ పోర్న్ చూడడం, సేవ్ చేయడం కూడా నేరం కిందికే వస్తుంది. ఈ కేసులో పట్టుబడితే తగిన చర్యలు తీసుకుంటారు. ఈ తరహా నేరానికి ఐదు నుంచి ఏడు ఏర్పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అలాగే గూగుల్లో బాంబులు లేదా ఇతర ఆయుధాలను తయారు చేసే పద్ధతిని తెలుసుకోవడానికి ప్రయత్నించడం కూడా నేరం కిందికే వస్తుంది. ఇలా చేయడం వల్ల మొదట భద్రత సంస్థల రాడార్లోకి వస్తారు. అనంతరం వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రెషర్ కుక్కర్ బాంబు తయారీ విధానాన్ని గూగుల్లో వెతకడం కూడా నేరం కిందకే వస్తుంది. అబార్షన్ గురించి గూగుల్ లో ఎప్పుడు సెర్చ్ చేయకూడదు. డాక్టర్ అనుమతి లేకుండా అబార్షన్ చేయడం భారతదేశంలో చట్ట విరుద్ధం. దీని గురించి గూగుల్ లో వెతికితే ఇరుక్కునే అవకాశం ఉంది. రక్షణ పరంగా కూడా ఇది సరైన పద్ధతి కాదు. దీనిని గూగుల్ లో ఎప్పుడు సెర్చ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గూగుల్లో నేర కార్యకలాపాల గురించి చర్చ చేయడం ఇబ్బందితో కూడుకున్న విషయంగానే భావించాలి. అత్యాచార బాధితురాలు పేరును వెతకడం కూడా నేరం కిందే పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇంటర్నెట్ వినియోగించే వాళ్ళు ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.