కంటి కింద నల్లటి వలయాలు వేధిస్తున్నాయా.! ఇలా ఇలా చేస్తే డాట్ సర్కిల్స్ మాయం

కంటి కింద నల్లటి వలయాలు చర్మ ముఖ సౌందర్యాన్ని తగ్గించడంతోపాటు పాలిపోవడాన్ని పెంచుతుంది. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్, క్రీములు వాడిన చాలా మందిలో ఫలితం కనిపించదు. అయితే కంటి కింద వచ్చే నల్లని వలయాలను తగ్గించేందుకు, ముఖంలో కాంతిని పెంచేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అటువంటి వాటిని అనుసరించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కంటి కింద నల్లని వలయాలు ఉండేవాళ్లు దోసకాయ ముక్కలను కళ్ళపై అప్లై చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

Dark circles under the eyes

కంటి కింద నల్లటి వలయాలు

ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు, పరుగులతో కూడిన ఉద్యోగం, పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాలతో ఎంతో మందిలో కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. రాత్రి వేళల్లో సెల్ ఫోన్ ఎక్కువగా వినియోగించే వారిలో స్క్రీన్ టైమ్ అధికంగా ఉండే కారణంగా కూడా ఈ ఇబ్బంది ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. కంటి కింద నల్లటి వలయాలు చర్మ ముఖ సౌందర్యాన్ని తగ్గించడంతోపాటు పాలిపోవడాన్ని పెంచుతుంది. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్, క్రీములు వాడిన చాలా మందిలో ఫలితం కనిపించదు. అయితే కంటి కింద వచ్చే నల్లని వలయాలను తగ్గించేందుకు, ముఖంలో కాంతిని పెంచేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అటువంటి వాటిని అనుసరించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కంటి కింద నల్లని వలయాలు ఉండేవాళ్లు దోసకాయ ముక్కలను కళ్ళపై అప్లై చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. దోసకాయ రసాన్ని రోజ్ వాటర్ తో కలిపి ఆ మిశ్రమాన్ని కళ్లపై పది నుంచి 15 నిమిషాలపాటు ఉంచడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. కళ్ళ కింద ఉండే నల్లని వలయాలను తొలగించడంలో ఆలోవెరా జెల్ కీలకంగా పని చేస్తుంది. ఆలోవెరా జెల్ ను కళ్ళ కింద నల్లటి వలయాలు తొలగించడంలో సహాయపడుతుంది.

ఈ జెల్ ను కళ్ల కింద అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి. అలోవెరా చర్మాన్ని సౌకర్యవంతంగా, మృదువుగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కింద నల్లటి వలయాలను, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి. బాదం నూనె మాయిశ్చరైజర్ చాలా ప్రభావంతంగా పని చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కళ్ళ కింద నల్లటి వలయాలను పోగొట్టి చర్మానికి నిగారింపును అందిస్తుంది. ఇందుకోసం పడుకునే ముందు బాదం నూనెను కళ్ళ చుట్టూ వృత్తాకార కదలికలలో మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. దీనివల్ల కంటి కింద ఉండే నల్లని వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. అదే సమయంలో ముఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది. సాధారణంగా కంటి కింద నల్లని వలయాలు ఉన్నవారిలో ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. ముఖంలో కాంతి కనిపించదు. దీనివల్ల వారంతా ముఖం పొడి బారినట్టు కనిపిస్తుంది. ఏదో కోల్పోయిన వారిలా కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ చిట్కాలను పాటించడం ద్వారా కాంతివంతమైన ముఖ సౌందర్యాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్