సోషల్ సైకోలు వైసిపిలోనే ఉన్నారా.. పరిధి దాటి వ్యవహరిస్తున్న టిడిపి, జన సైనికుల సంగతేంటి.?

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోపాటు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీకి చెందిన సామాజిక కార్యకర్తలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అణిచివేత ప్రక్రియను ప్రారంభించింది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉన్న వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపించడంతోపాటు వేధింపులకు గురిచేస్తుంది.

Arrested Varra Ravinder Reddy

అరెస్టు అయిన వర్రా రవీందర్ రెడ్డి

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోపాటు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీకి చెందిన సామాజిక కార్యకర్తలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అణిచివేత ప్రక్రియను ప్రారంభించింది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉన్న వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపించడంతోపాటు వేధింపులకు గురిచేస్తుంది. గతంలో ఇటువంటి వ్యవహారాలకి వైసీపీ ప్రభుత్వం పాల్పడినప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి కీలక నాయకుడు నారా లోకేష్.. ఇప్పుడు అటువంటి తరహా చర్యలకు పాల్పడుతుండడం పట్ల ఎటువంటి సమాధానం చెబుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు వేదికగా వ్యక్తిగత విధిస్తూ, అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారంటూ వైసీపీకి చెందిన ఎంతో మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. నిజంగా ఈ తరహా దుర్భాసలాడుతూ పోస్టులు పెట్టేవారు ఎవరైనా సరే శిక్షార్పులే. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అదే సమయంలో సామాజిక మాధ్యమాలు వేదికగా విచ్చలవిడిగా రెచ్చిపోతూ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైయస్ భారతి, సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గురించి, ఇతర వైసిపి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యుల గురించి అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతూ, మార్ఫింగులు చేస్తూ దారుణాలకు ఓడుగడుతున్న మిగిలిన సోషల్ సైకోల సంగతి ఏం చేస్తారో అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కుటుంబ సభ్యులపై ఎవరు ఈ తరహా పోస్టులు పెట్టిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. మరి ఈ తరహా చర్యలను ఎందుకు ప్రభుత్వం తీసుకోవడం లేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టే పోస్టులు మాత్రమే పోలీసులకు కనిపిస్తున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. దారుణాతి దారుణంగా సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఎంతోమంది పోస్టులు పెడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననానికి ఎంతో మంది పాల్పడుతున్నారు. మరి అటువంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. చట్టం ముందు అందరూ సమానమే అన్నట్టు గొంతు చించుకుంటూ మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి తమ వైపు నుంచి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారం గురించి ఎందుకు మాట్లాడడం లేదంటూ నిపుణుల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ తరహా తప్పులను తీవ్రస్థాయిలో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాత్రం అటువంటి వారిని ఉపేక్షించకుండా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తామ చేస్తే సంసారం.. ఎదుటి వాళ్లు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వ్యవహారం సాగుతోందంటూ పలువురు పేర్కొంటున్నారు.

చట్టం ముందు అందరూ సమానమే అని గట్టిగా చెప్పే పవన్.. మరి ఆ సమానత్వ భావనను ఎందుకు అమలు చేయడం లేదో అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ నాగేశ్వరరావు కూడా తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని, దారుణమైన పోస్టులను గురించి ప్రస్తావిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వంపై సహేతుకమైన విమర్శలు చేసే వారి పైన కూడా ఈ తరహా దుర్భాసలాడుతూ వేధింపులకు గురి చేసే వారిని పట్టించుకోకుండా.. వైసీపీకి సంబంధించిన సామాజిక కార్యకర్తలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం దేనికి సంకేతం ఈ ప్రభుత్వం చెప్పాలి అంటూ డిమాండ్ వినిపిస్తోంది. మరి ఇకపై అయినా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సోషల్ మీడియాలో అడ్డగోలుగా వ్యవహరించే, పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటుందో.. లేక వైసీపీ లక్ష్యంగా మాత్రమే ఈ చట్టాలను వినియోగిస్తుందో చూడాల్సి ఉంది. ఇదే ఒరవడి కొనసాగితే భవిష్యత్తులో కూటమికి చెందిన సామాజిక మీడియా కార్యకర్తలు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వైసీపీ హెచ్చరికలు నిజం కావచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్