విశాఖ అరకు ఏజెన్సీలో గిరిజన రైతుల పండించే కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఇన్నాళ్లు దీనిని జిసిసి అరకు వ్యాలీ కాఫీ పేరుతో విక్రయిస్తోంది. తాజాగా సర్టిఫికెట్ లభించడంతో సర్టిఫైడ్ ఆర్గానిక్ కాఫీ పేరుతో మార్కెట్లో అమ్మేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం టాటా కంపెనీతో జిసిసి ఒప్పందం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. అరకు కాఫీ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో దీనిని ప్రపంచ దేశాలకు తెలియజేసేలా ప్రచారాన్ని నిర్వహిస్తూ వచ్చాయి.
ప్రతీకాత్మక చిత్రం
విశాఖ అరకు ఏజెన్సీలో గిరిజన రైతుల పండించే కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఇన్నాళ్లు దీనిని జిసిసి అరకు వ్యాలీ కాఫీ పేరుతో విక్రయిస్తోంది. తాజాగా సర్టిఫికెట్ లభించడంతో సర్టిఫైడ్ ఆర్గానిక్ కాఫీ పేరుతో మార్కెట్లో అమ్మేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం టాటా కంపెనీతో జిసిసి ఒప్పందం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. అరకు కాఫీ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో దీనిని ప్రపంచ దేశాలకు తెలియజేసేలా ప్రచారాన్ని నిర్వహిస్తూ వచ్చాయి. విశాఖలో అనేక సందర్భాల్లో నిర్వహించిన పెట్టుబాడుదారుల సదస్సులో ప్రత్యేకంగా అరకు కాఫీ పేరుతో స్టాల్ ఏర్పాటు చేసి విదేశీ పారిశ్రామికవేత్తలకు ఈ కాఫీ రుచిని చూపించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అరకు కాఫీ రుచిని చూపించడం ద్వారా వారి మదిని గెలుచుకున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు దేశంలోని అనేక చోట్ల కూడా అరకు స్టాల్స్ పెట్టించారు. రసాయన ఎరువులు ఉపయోగించకుండా అరకు కాఫీని ఉత్పత్తి చేసేలా 2600 గిరిజన కుటుంబాలకు శిక్షణ కూడా ఇచ్చారు. వారికి అవసరమైన ఆర్థిక సాయం, పంట కొనుగోలు, మార్కెటింగ్ వంటి బాధ్యతలను జిసిసి తీసుకుంది.
పూర్తిగా సేంద్రీయ పంట అయినప్పటికీ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడ) ధ్రువీకరిస్తే తప్ప ఆర్గానిక్ సర్టిఫికేషన్ రాదు. రైతులు కాఫీ పండించే విధానాన్ని అన్ని దశల్లో మూడేళ్లు వరుశుగా పరిశీలించి సంతృప్తి చెందితే తప్ప అపెడా సర్టిఫికేషన్ ఇవ్వదు. దీనికి జిసిసి అధికారులు నిత్యం రైతులను ప్రోత్సహిస్తూ కాఫీని సాగు చేయించారు. దీనికోసం మరో 70 లక్షలు వెచ్చించారు. ఎట్టకేలకు అపెడా అరకు కాఫీకి గత నెల ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఒక్క కాఫీ కే కాకుండా అందులో అంతర పంటగా వేసిన మిర్యాలకు కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్ ద్వారా అరకు కాఫీతో పాటు మిర్యాలకు చేరుచుకున్నట్టు అయింది. దీంతో జర్మనీతోపాటు పలు యూరప్ దేశాల నుంచి అరకు ఆర్గానిక్ సర్టిఫైడ్ కాపీ కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఉత్సాహంతో మిరియాలను కూడా ఆర్గానిక్ పెప్పర్ పేరుతో విక్రయించాలని జిసిసి ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని మండలాల్లో కాఫీ సేంద్రీయ సాగును ప్రోత్సహించేందుకు 2.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీలోని అన్ని మండలాల్లో రైతులు కాపీ పండించేలా ప్రోత్సాహన అందిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. సేంద్రీయ విధానంలో పండించిన కాఫీ 2 టన్నుల వరకు ఉంటుంది. జిసిసి అరకు కాపీ కొనుగోలు చేయడానికి ముందు కేజీ కాఫీకి ₹90 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. జిసిసి కాఫీ సేకరించడం ప్రారంభించిన తర్వాత కిలోకు 450 చొప్పున ఇస్తోంది. విశాఖ ఏజెన్సీ శ్రీకాకుళం జిల్లా సీతంపేటలోను పసుపు పండుతోంది దీనికి కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.