తీవ్ర అస్వస్థతకు గురైన ఏఆర్ రెహమాన్.. ఆసుపత్రిలో చికిత్స

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. రెహమాన్ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. వైద్య నిపుణుల బృందం ఆయనకు చికిత్సను అందిస్తోంది. ఏఆర్ రెహమాన్ కు యాంజియోగ్రామ్, ఈసీజీ వంటి పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రెహమాన్ తాజాగా సంగీతం అందించిన చిత్రం చావా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

AR Rahman

ఏఆర్ రెహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. రెహమాన్ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. వైద్య నిపుణుల బృందం ఆయనకు చికిత్సను అందిస్తోంది. ఏఆర్ రెహమాన్ కు యాంజియోగ్రామ్, ఈసీజీ వంటి పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రెహమాన్ తాజాగా సంగీతం అందించిన చిత్రం చావా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. వందల కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొడుతూ ఇండియన్ సినిమా చరిత్రలో తనకొంటూ ప్రత్యేకతను ఈ సినిమా సృష్టించుకుంటుంది. ఈ చిత్ర బృందం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో రహమాన్ ఆసుపత్రిలో చేరడం ఆ సినిమా వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి వద్దే ఉన్నారు. రెహమాన్ అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే రెహమాన్ కొన్ని నెలల క్రితమే భార్యతో విడాకులు తీసుకున్నారు. 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు పొందారు. 1995లో సైరా బానును రెహమాన్ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మనస్పర్ధలు కారణంగా ఇద్దరూ విడిపోయినట్లు గెలుస్తోంది. రెహమాన్, సైరా బానుల విడాకులపై వారి అడ్వకేట్ వందన్ షా మాట్లాడుతూ ఇద్దరి మధ్య గాడమైన ప్రేమ ఉన్న చిన్న చిన్న భేదాలు గొడవలు వచ్చాయన్నారు. అవి వారి మధ్య అధిగమించలేని అగాధాన్ని సృష్టించినట్లు పేర్కొన్నారు. సైరా చాలా బాధ వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక వారి పిల్లలు కూడా విడాకులు స్పందించారు. తమ తల్లిదండ్రులు విడాకులు విషయంలో గోపీయత పాటించి గౌరవంగా వ్యవహరించారని వెల్లడించారు. విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే రెహమాన్ అనారోగ్యం బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెహమాన్ కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. స్వల్ప గుండు పోటు రావడం వల్లే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆయన కుటుంబ సభ్యులు గానీ ఆసుపత్రి వర్గాలు గాని బయటకు చెప్పలేదు. రెహమాన్ ఆరోగ్య పరిస్థితి పై ఆసుపత్రి వర్గాలు సాయంత్రానికి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్