గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతధం.. పరీక్ష వాయిదా లేదని ప్రకటించిన ఏపీపీఎస్సీ

ఏపీలో గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదనను ఏపీపీఎస్సీ పరిగణలోకి తీసుకోలేదు. రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించి మెయిన్స్ నిర్వహించాలంటూ గడిచిన కొద్ది రోజులుగా మెయిన్స్ కు అర్హత సాధించిన వందలాదిమంది అభ్యర్థులు ఆందోళన చేస్తూ వచ్చారు. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా శనివారం రాత్రి వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళనలో నిర్వహించారు. అయినప్పటికీ ఏపీపీఎస్సీ మాత్రం పరీక్షను వాయిదా వేసేందుకు అంగీకరించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయలేమని ప్రకటించింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదనను ఏపీపీఎస్సీ పరిగణలోకి తీసుకోలేదు. రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించి మెయిన్స్ నిర్వహించాలంటూ గడిచిన కొద్ది రోజులుగా మెయిన్స్ కు అర్హత సాధించిన వందలాదిమంది అభ్యర్థులు ఆందోళన చేస్తూ వచ్చారు. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా శనివారం రాత్రి వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళనలో నిర్వహించారు. అయినప్పటికీ ఏపీపీఎస్సీ మాత్రం పరీక్షను వాయిదా వేసేందుకు అంగీకరించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయలేమని ప్రకటించింది. దీంతో వేలాదిమంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. అభ్యర్థుల ఆందోళనలు నేపథ్యంలోనే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరగనుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాదులోని కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించనున్నారు. శనివారం రాత్రి వరకు అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళనలో అభ్యర్థులు మాట్లాడుతూ తాము పరీక్షలను బాయ్ కాట్ చేస్తామని ప్రకటించారు. అయితే అభ్యర్థులు ఎంతవరకు ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. 

ఇది వివాదం.. అందుకే ఆందోళన 

గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేయడానికి కీలకమైన కారణం ఉంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 డిసెంబర్ లో వచ్చింది. నోటిఫికేషన్ ఇవ్వడంతోనే వివాదం మొదలైంది. వివిధ సామాజిక వర్గాలకు పోస్టులు కేటాయింపు సరిగా జరగలేదని ఇందులో తప్పులు ఉన్నాయని గుర్తించిన అభ్యర్థులు వాటిని సరిచేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అప్పటివరకు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే గతంలోనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన సుమారు 92,000 మంది అభ్యర్థులు ఎప్పటికైనా రాష్ట్ర విధానంలో ఉన్న తప్పులను సవరించి మెయిన్స్ నిర్వహించాలంటూ గడిచిన కొద్దిరోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. రోస్టర్ విధానాన్ని సవరించకపోతే భవిష్యత్తులో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే తామంతా నష్టపోవాల్సి వస్తుందని, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ రద్దు చేసే ప్రమాదం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు ఏపీపీఎస్సీ ఈనెల 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు ఆందోళన ఉదృతం చేశారు. గడిచిన వారం పది రోజుల నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకొని ఏపీపీఎస్సీకి లేక కూడా రాసింది. అయితే ఏపీపీఎస్సీ అధికారులు మాత్రం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని మార్చుకోలేమని స్పష్టం చేసింది. దీంతో అభ్యర్థులు తప్పనిసరి పరిస్థితుల్లో మెయిన్స్ పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెయిన్స్ పరీక్ష వాయిదా వేసారంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంపైన ఏపీపీఎస్సీ సీరియస్ గా స్పందించింది. ఈ తప్పుడు ప్రచారాలపై కేసు కూడా పెట్టించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్