డిగ్రీ అర్హతతో అప్రెంటిస్ పోస్టులు.. భారీ వేతనంతో ఉద్యోగం.!

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం గా చెప్పవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఒక ప్రకటనలో కోరింది. ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందించనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 145 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు 9000 రూపాయలు స్టాఫ్ అండ్ అందించనున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం గా చెప్పవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఒక ప్రకటనలో కోరింది. ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందించనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 145 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు 9000 రూపాయలు స్టాఫ్ అండ్ అందించనున్నారు. ఏప్రిల్ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. చెన్నై యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIICL) మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలో ఖాళీగా ఉన్న 145 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.

దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. ఇక దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు విషయానికొస్తే 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది. ఓబిసి అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు లభిస్తుంది. దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల వయసు సడలింపు లభిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.9 వేలు స్టైఫండ్ ఇవ్వనన్నారు. ఆన్లైన్లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా పోస్టుకు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం http://uiic.co.in వెబ్ సైట్ కూడా సంప్రదించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. గడువులోగా అర్హత కలిగిన మిగిలిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్